E-Paper
Advertisement

Bheemili: భీమిలి తీరంలో.. వడ దెబ్బ ముసుగు వేసి, చున్నీతో భర్త గొంతు బిగించి

Bheemili: భీమిలి తీరంలో.. వడ దెబ్బ ముసుగు వేసి, చున్నీతో భర్త గొంతు బిగించి
Advertisement

Bheemili: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను వడదెబ్బ పేరుతో లేపేసింది భార్య. పైగా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. పోలీసుల ముందు ఆమె ఎత్తులు చిత్తుకావడంతో అడ్డంగా బుక్కైంది. సంచలనం రేపిన భీమిలి తీరంలో ఈ ఘటన వెలుగుచూసింది. అసలేం జరిగింది?

భీమిలి తీరంలో దారుణమైన ఘటన

Advertisement

విశాఖ జిల్లాలో భీమిలి సమీపంలోని వలందపేట గ్రామంలో భర్తను దారుణంగా చంపేసింది భార్య. వలందపేట గ్రామానికి చెందిన 28 ఏళ్ల సూరిబాబు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 26 ఏళ్ల నాగమణి‌తో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే ఈ దంపతులకు సంతానం లేదు. నాగమణి స్థానికంగా ఉండే ఓ న్యూడిల్స్‌ షాపులో పని చేస్తోంది. ఆమె భర్త తాపీ మేస్త్రి పని చేస్తున్నాడు.

భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. భార్యపై అనుమానం పడడం మొదలుపెట్టాడు సూరిబాబు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం లభించేది. ఆనాటి నుంచి ఎడముఖం, పెడముఖంగా ఉంటూ వ్యవహరించేవారు. ఫలితంగా తాగేసి భర్త ఇంటికి రావడంతో భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

Advertisement

వడ దెబ్బ పేరుతో  చున్నీతో భర్త గొంతు బిగించి చంపేసిన భార్య

ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయిన నాగమణి, పెద్దల రాజీతో ఇటీవల భర్త దగ్గరకు వచ్చింది. అయినా సరే అనుమానం సూరిబాబుని వెంటాడుతూనే ఉంది. ఆదివారం సాయంత్రం తాగొచ్చిన భర్తతో గొడవపడింది భార్య నాగమణి. ఇదే సరైన సమయమని భావించింది. ఆ మాత్రం ఆలస్యం చేయకుండా కోపంతతో చున్నీతో భర్త గొంతు బిగించింది.

ఫలితంగా ఊపిరి ఆడక పడిపోయాడు. తాగేసి పడిపోయి లేవలేదంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించింది భార్య. సంగివలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే సూరిబాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి వడదెబ్బ కారణంగా భర్త చనిపోయాడని ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. దీంతో సూరిబాబు కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై 7 కార్లు, లారీలు ఢీ

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత సూరిబాబు భార్య నాగమణిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో జరిగినదంతా బయట పెట్టేసింది. నిందితురాలిని ఓ హోమ్‌కు తరలించిన పోలీసులు, సూరిబాబు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, వారి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ విషయాలను పోలీసులు వెల్లడించారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×