BAN vs PAK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ( Bangladesh vs Pakistan, 1st Test) మ్యాచ్ ఇవాళ ప్రారంభమైంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం ( Shere Bangla National Stadium, Dhaka) వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇవాళ ప్రారంభమైన ఈ తొలి టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్. ఈ క్రమంలో మొదటి రోజు ముగిసే సమయానికి నాలుగు జట్ల నష్టానికి 301 పరుగులు సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ రిజ్వాన్ ( Muhammad Rizwan), పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ ( Captain Shan Masood) మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. షాన్ మసూద్ ను కాదని రిజ్వాన్ కెప్టెన్ లాగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రిజ్వాన్ పై ( Bangladesh vs Pakistan, 1st Test) ఢాకా వేదికగా ఇవాళ తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా బరిలోకి దిగిన మహమ్మద్ రిజ్వాన్ ఓవరాక్షన్ చేశాడు. కెప్టెన్ తానే అన్నట్లుగా బిల్డప్ కొట్టాడు. ఈ నేపథ్యంలోనే నోమాన్ అలీ బౌలింగ్ చేయగా… ఆ సందర్భంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు మహమ్మద్ రిజ్వాన్. వికెట్ల వెనకాల ఉండి అందరిని సెట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో షాన్ మసూద్ సీరియస్ అయ్యాడు. కెప్టెన్ నేను ఉండగా నువ్వెలా ఫీల్డింగ్ సెట్ చేస్తావ్ ? అంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో వైరల్ అయిన తరుణంలో పాకిస్తాన్ టీమ్ ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ప్లేయర్ల మధ్యే సంఖ్యత లేదని, ఇలాంటి వాళ్లు వరల్డ్ కప్ లు ఎలా గెలుస్తారంటూ ఆడుకుంటున్నారు.
ఢాకా ( Shere Bangla National Stadium, Dhaka) వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. పాకిస్తాన్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న బంగ్లాదేశ్… మొదటి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 301 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు విఫలమైన మోమినల్ హక్ 91 పరుగులు చేశాడు. నజ్ముల్ హుస్సేన్ షాంటో సెంచరీ తో రెచ్చిపోయాడు. ప్రస్తుతం ముస్తాఫిజర్ రహీం 48 పరుగులతో రాణిస్తున్నాడు. ఇదే ఊపు కొనసాగిస్తే, రేపు 500లకు పరుగులు చేయనుంది బంగ్లాదేశ్.
Rizwan – "Started placing the field, even when captain is Masood"
Shan Masood – "I'm the captain, please listen to me"
BTW, Rizwan has a really bad habit of doing captaincy when he isn't captain anymore 🤪pic.twitter.com/hiYHCsEWAu
— Ajay Jadeja (@AjayJadeja171) May 8, 2026