E-Paper
Advertisement

Asia Cup Rising Stars 2025: టీమిండియా కొంపముంచిన సూప‌ర్ ఓవ‌ర్‌…ఫైన‌ల్ కు దూసుకెళ్లిన బంగ్లా

Asia Cup Rising Stars 2025: టీమిండియా కొంపముంచిన సూప‌ర్ ఓవ‌ర్‌…ఫైన‌ల్ కు దూసుకెళ్లిన బంగ్లా
Advertisement

Asia Cup Rising Stars 2025:   ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో (ACC Mens Asia Cup Rising Stars 2025) బంగ్లాదేశ్ A జ‌ట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్న‌మెంట్ సెమీ ఫైనల్ దశలో టీమిండియా జట్టును ( India A ) చిత్తు చేసి, ఫైనల్ కు దూసుకు వెళ్ళింది బంగ్లాదేశ్‌ (Bangladesh A ). ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ డ్రా కావ‌డంతో సూప‌ర్ ఓవ‌ర్ ఆడాల్సి వ‌చ్చింది. అయితే, ఈ సూప‌ర్ ఓవ‌ర్ లో బంగ్లాదేశ్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. దీంతో ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో టీమిండియా ఇంటి దారి ప‌ట్ట‌గా, బంగ్లాదేశ్ ఫైన‌ల్స్ కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌ ఫైన‌ల్స్ కు దూసుకెళ్లిన త‌రుణంలో న‌వంబ‌ర్ 23వ తేదీన అంటే ఆదివారం పాకిస్తాన్, శ్రీలంక జ‌ట్ల‌లో ఒక దానితో ఫైన‌ల్ ఆడ‌నుంది.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

టీమిండియా కొంపముంచిన సూప‌ర్ ఓవ‌ర్‌

Advertisement

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ A చేతులో టీమిండియా A దారుణ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ సూపర్ వరకు దారి తీయడంతో.. ఒకే ఒక్క పరుగుతో బంగ్లాదేశ్ A విజయం సాధించింది. ఈ సూపర్ ఓవర్ లో టీమిండియా A మొదట బ్యాటింగ్ చేసింది. అదృష్టం బంగ్లాదేశ్ A వైపు ఉన్న నేపథ్యంలో సున్నాకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా A. దీంతో ఒకే ఒక్క పరుగు చేస్తే బంగ్లాదేశ్ A గెలుస్తుంది. ఆ ఒక్క పరుగు కూడా మనోళ్లు వైడ్‌ రూపంలో ఇచ్చేశారు. సూప‌ర్ ఓవ‌ర్ సంద‌ర్భంగా బంగ్లాదేశ్ A బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో తొలి బంతికి వికెట్ పడింది. ఆ తర్వాత బంతిని సుయాష్ శర్మ వైడ్ వేశాడు. దీంతో సెమీఫైనల్ లో గ్రాండ్ విక్టరీ కొట్టి, ఫైనల్ కు దూసుకు వెళ్ళింది బంగ్లాదేశ్. ఇక ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి టీమిండియా ఏ జట్టు వైదొలిగింది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో బంగ్లాదేశ్ ఆదివారం రోజు అంటే నవంబర్ 23వ తేదీన ఫైనల్ ఆడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలుస్తుంది.

డ్రాగా మారిన మ్యాచ్‌

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ లో భాగంగా బంగ్లాదేశ్ A జ‌ట్టు వ‌ర్సెస్ టీమిండియా A మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 194 పరుగులు చేసింది. ఇక అటు ఛేజింగ్ లో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్ట‌పోయి 194 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ డ్రా అయి, సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లింది. కానీ ఇందులో బంగ్లాదేశ్ గెలిచింది.

Advertisement

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×