E-Paper
Advertisement

Salt water: గోరువెచ్చటి ఉప్పునీటిలో పాదాలను నానబెడితే ఏమవుతుంది?

Salt water: గోరువెచ్చటి ఉప్పునీటిలో పాదాలను నానబెడితే ఏమవుతుంది?

మన రోజువారీ జీవితంలో ఒత్తిడి, అలసట, పనిభారం పెరుగుతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పరుగులు పెట్టే శరీరానికి, ముఖ్యంగా పాదాలకు ఎప్పుడూ సేదతీరే అవకాశం ఉండదు. నడక, నిలబడటం, మెట్లు ఎక్కడం, రోజు మొత్తం పనుల.. ఇలా పాదాలపై నిరంతరం ఒత్తిడి పడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పాదాలకు కొంత విశ్రాంతిని ఇవ్వడానికి గోరువెచ్చటి ఉప్పు నీటిలో వాటిని నానబెట్టడం చాలా మంచి పద్ధతి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లోనే చేయగలిగే ఈ చిన్న ఇంటి చిట్కా శరీరానికి అనేక లాభాలను అందిస్తుంది.

అలసట తగ్గించి శరీరానికి రిలీఫ్
రోజంతా నడిచిన తర్వాత పాదాలు బరువుగా, నొప్పిగా అనిపించడం సహజం. గోరువెచ్చటి నీటిలో ఉప్పును కలిపి పావుగంట పాటూ పాదాలను నానబెట్టితే మడమల నుండి వేళ్ల వరకు ఉన్న మసిల్స్ రిలాక్స్ అవుతాయి. వేడి నీరు రక్తనాళాలను విస్తరింపజేయడం వల్ల పాదాల వద్ద రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది కాళ్లలోని అలసటను త్వరగా తగ్గిస్తుంది. ఉద్యోగం కోసం ఎక్కువ నడిచే వారు, రోజూ నిలబడే వారు, గృహిణులు ఇలా ఉప్పు నీటిలో పాదాలను నానబెడితే ఉపశమనం దక్కుతుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది
మన పాదాల అడుగుభాగంలో శరీరంలోని పలు నాడులకు సంబంధించిన పాయింట్లు ఉంటాయి. వాటిని వేడి ఉప్పు నీటిలో నానబెట్టడం ద్వారా నాడులు వ్యాకోచిస్తాయి. దీంతో మానసిక ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది.పాదాలను గోరువెచ్చని నీటిలో నానబెట్టడం ద్వారా స్ట్రెస్ హార్మోన్లు తగ్గి మైండ్ శాంతిస్తుంది. రాత్రి నిద్రకు ముందు చేస్తే మంచి నిద్ర పడేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. పాదాలు మన శరీరంలో రక్తప్రసరణ జరిగే చివరి భాగాలు. కూర్చునే అలవాటు, ఎక్కువసేపు నిలబడటం వంటివి చేయడం వల్ల రక్తప్రసరణ ప్రభావితం అవుతుంది. ఉప్పు కలిపిన వేడి నీరు రక్తనాళాలను విస్తరించడంతో పాదాల వద్ద రక్తం సులభంగా ప్రసరిస్తుంది. దీని వల్ల కాళ్లు బరువుగా అనిపించడం, నొప్పి, గడ్డలు వంటి సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో లేదా ఎక్కువసేపు నీళ్లలో పని చేసే వారికి మడమలు పగిలిపోవడం సాధారణం. గోరువెచ్చటి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల మడమల వద్ద ఉండే చర్మం పొడిగా మారుతుంది. తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే పగుళ్లు తగ్గడానికి సహాయపడుతుంది. వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. డస్ట్, షూల్లో ఎక్కువసేపు చెమట, బాక్టీరియా ఇవన్నీ పాదాల దుర్వాసనకు కారణం. గోరువెచ్చటి నీటిలో పాదాలను నానబెట్టడం ద్వారా చర్మం శుభ్రం అవుతుంది. నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే బ్యాక్టీరియా తగ్గి దుర్వాసన తగ్గుతుంది. చాలామందికి పాదాల్లో మొద్దుబారటం, సూదులు గుచ్చినట్టు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటిలో కొన్నవి రక్త ప్రసరణ లోపం వల్ల, కొన్ని నాడీ సమస్యల వల్ల వస్తాయి. ఉప్పు నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల నాడులకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల ఈ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి.

ఎలా చేయాలి?
ఒక పెద్ద బకెట్ లేదా టబ్‌లో గోరువెచ్చటి నీరు తీసుకోవాలి. నీరు అతి వేడిగా ఉండకూడదు. ఒక టీ స్పూన్ ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్ వేయవచ్చు. పాదాలను పావుగంట పాటూ నానబెట్టాలి.
ఆ తరువాత బాగా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పాదాల్లో గాయాలు, తెరుచుకున్న పగుళ్లు ఉన్నవారు, ఇన్ఫెక్షన్లు ఉన్న వారు, డయాబెటిస్ ఉన్నవారు ముందుగా వైద్య సలహా తీసుకుని ఈ పద్ధతి పాటించాలి.

Related News

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

Big Stories

×