E-Paper
Advertisement

Raju Weds Rambai Heroine: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ తో ఓవర్‌ నైట్‌ స్టార్‌.. ఇంతకి ఎవరీ తేజస్వీ రావు!

Raju Weds Rambai Heroine: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ తో ఓవర్‌ నైట్‌ స్టార్‌.. ఇంతకి ఎవరీ తేజస్వీ రావు!
Advertisement

Raju Weds Rambai Heroine : ఈ వారం థియేటర్లలోకి అరజనుపైగా సినిమాలు వచ్చాయి. అందులో ప్రేమంట, 12A రైల్వే స్టేషన్‌, రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రాలకే కాస్తా ఎక్కువ బజ్‌ ఉంది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూడు చిత్రాల్లో కాస్తా ఎక్కువ బజ్ ఉంది మాత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’కే. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ముఖ్యంగా యూత్‌ ని ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుంది.

జూనియర్‌ సాయి పల్లవి..

హీరోహీరోయిన్లు ఇద్దరి యంగ్‌స్టర్సే కావడంతో యూత్‌ని ఈ లవ్‌స్టోరీ బాగా మెప్పిస్తుంది. ఇక హీరోయిన్‌ తేజస్వీ రావు యాక్టింగ్‌ కి అయితే మేల్‌, ఫీమేల్‌ ఆడియన్స్‌ అంత ఫిదా అవుతున్నారు. తేజస్వీ రావు యాక్టింగ్‌ సూపర్‌ అంటూ పొగిడేస్తున్నారు. తన యాక్టింగ్‌ చాలా సహాజంగా ఉందని, లవ్‌స్టోరీ సినిమాలో సాయి పల్లవిని గుర్తు చేసిందంటూ. అంతేకాదు నేచురల్‌ లుక్‌లో తేజస్వీ రావు స్క్రీన్‌ ప్రజెస్‌తో ఆకట్టుకుంటుందని ఆడియన్స్‌ కొనియాడుతున్నారు. కొత్త హీరోయిన్ అయినా యాక్టింగ్‌ లో సీనియర్‌ హీరోయిన్లను సైతం మించిపోయిందంటున్నారు. ఈ సినిమాతో ఆమెకు ఫాలోయింగ్‌ పెరిగింది. లేడీ ఫ్యాన్స్‌ సైతం తేజస్వీ యాక్టింగ్‌, లుక్‌ కి ఫిదా అవుతున్నారు.

క్యూట్‌ లుక్స్‌ తో ఫిదా

Advertisement

ఆమె నటన చాలా క్యూట్‌ గా ఉందని, ఇండస్ట్రీకి మరో సాయి పల్లవి దొరికేసిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి పల్లవి లాగే తెలంగాణ నేపథ్యంలో కాకపోయినా.. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పి అదరగొట్టింది. పుట్టింది గోదావరి జిల్లా అయినా.. అచ్చమైన తెలంగాణ పిల్లగా డైలాగ్స్‌ చెప్పి ఇక్కడ ఆడియన్స్‌ కి కనెక్ట్‌ అయ్యింది. ఇక సినిమాలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె వస్తున్న గుర్తింపు, ప్రశంసలు చూస్తుంటే రాబోయే రోజుల్లో శ్రీలీలలా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిన ఆశ్చర్యం పోనవసరం లేదు అనిపిస్తోంది. సినిమాల కంటే ముందు తేజస్వీ.. ఎన్నో షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించింది.

షార్ట్స్ ఫిల్మ్స్ తో గుర్తింపు

సయోని, బావమరదలు 1-2, పెళ్లి కూతురు విత్‌ మేనీ డౌట్స్‌, మినిట్స్, నిశ్చితార్థం, కేరళ కుట్టి, లవ్‌ స్టోరీ ఇన్‌ రాజమండ్రీ, మాస్‌ గాడి క్లాస్‌ పిల్ల వంటి తదితర షార్ట్స్‌ ఫిల్మ్స్‌తో నటించిన ఆమె చాలా కాలం తర్వాత కమిటీ కుర్రాళ్లు మూవీతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. నిజానికి తేజస్వి రావు ఇప్పటికే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. కమిటీ కుర్రాళ్లు ఆమె డెబ్యూ సినిమా. అందరు కొత్త నటీనటులతో వచ్చిన ఇందులో తేజస్వీ కూడా ఉంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో ఎక్కువ మంది నటీనటులు ఉండటంతో తేజస్వీ కి అంతమాత్రంగానే గుర్తింపు వచ్చింది. అదే గుర్తింపుతో రాజు వెడ్స్‌ రాంబాయిలో హీరోయిన్ చాన్స్‌ కొట్టేసింది. నేడు (నవంబర్ 21) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాలో తనదైన నటన, అందం, అభినయంతో ఆడియన్స్‌ కట్టిపడేసింది. ఈ సినిమాతో తేజస్వీ ఇండస్ట్రీ ద్రష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంది. ఈ సినిమా తో ఒక్కసారిగా తేజస్వీ సంచలనంగా మారింది.

Related News

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

Big Stories

Advertisement
×