BigTV English

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్  ప్రైవేట్ పార్ట్స్ పైనే  దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Umpire Injured: క్రికెట్ లో సాధారణంగా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రికెట్ లో కొంతమంది అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. మరి కొంతమంది అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. ఇంకొంతమంది మైదానంలో ఎక్కడైనా కళ్లు చెదిరే క్యాచ్ లు పట్టడం చూస్తుంటాం. అలాంటి క్యాచ్ పట్టినందుకు వారికి ప్రశంసలతో పాటు కొన్నిసార్లు నజరానా కూడా అందుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఫీల్డ్ లో సత్తా చాటుతున్నారు.


Also Read: Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

అయితే ఎంత మంచి బౌలర్ అయినా, ఎంత మంచి బ్యాటర్ అయినా, ఎంతమంది ఫీల్డర్లు అయినా కొన్ని కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం సహజమే. అది గల్లీ క్రికెట్ లో అయినా.. అంతర్జాతీయ క్రికెట్ లో అయినా.. అప్పుడప్పుడు పొరపాట్లు జరగడం సర్వసాధారణం. అయితే తాజాగా జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఫీల్డింగ్ లో విన్యాసాలు ప్రదర్శించడం వల్ల అప్పుడప్పుడు క్రికెటర్లు గాయాలపాలు అయ్యే సందర్భాలు ఉన్నాయి.


అయితే ఆ ఫీల్డర్.. బ్యాటర్ ని అవుట్ చేసేందుకు బంతిని తప్పుగా విసిరితే మాత్రం పొరపాటు జరిగి అంపైర్ కి గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ లో జరిగింది. బ్యాటర్ ని రనౌట్ చేసే క్రమంలో ఫీల్డింగ్ జట్టు వికెట్ కీపర్ బంతిని తీసుకొని నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ క్రీజ్ నుండి బయటకు వస్తుండగా అతడి ఎండ్ కి డైరెక్ట్ హిట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఆ వికెట్ల మార్క్ ని మిస్ అయ్యాడు. దీంతో ఆ బంతి నేరుగా ఆన్ ఫీల్డ్ అంపైర్ మోకాళ్ళపైన తగిలింది. కొంచెం తేడా జరిగినా ఆ బంతి అంపైర్ ప్రైవేట్ పార్ట్ కి తాకి ఉండేది. ఇక ఆ బంతి తగిలిన వెంటనే అంపైర్ నేలపై పడి నొప్పితో విలవిల్లాడాడు.

Also Read: Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

అనంతరం నిలబడడానికి ప్రయత్నించి నొప్పితో బాధపడ్డాడు. అతను మైదానంలో నిలబడడానికి ప్రయత్నించాడు కానీ నిలబడలేకపోయాడు. ఆ తరువాత ఫీల్డింగ్ జట్టు ఫీల్డర్లు క్షమాపణ చెప్పడానికి వచ్చినప్పుడు అతడు నేలపై కుంటుతూ పడిపోయాడు. ఈ సంఘటనతో మొదట అంతా నవ్వుకోగా.. ఆ తర్వాత షాక్ కి గురయ్యారు. గతంలో కూడా ఆస్ట్రేలియాలో ఓ సీనియర్ అంపైర్ మైదానంలో జరిగిన భయంకరమైన సంఘటనను ఎదుర్కొని తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన సంఘటన మనకు తెలిసిందే. సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా బంగ్లాదేశ్ లో చోటుచేసుకుంది. ఇక ఈ గాయం తర్వాత వైద్య సిబ్బందితో కలిసి మైదానం నుండి వెళ్లిపోయాడు ఆ అంపైర్. ఇక త్వరలో జరగబోయే ఆసియా కప్ 2025 కోసం బంగ్లాదేశ్ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు ఢాకాలో ఉంది.

Related News

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

Big Stories

×