BigTV English

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!

Mohammed Siraj: టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తన బౌలింగ్ ప్రతిభతో విదేశాల్లోనూ కీలక సందర్భాలలో రాణిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ పరాభవం నుంచి భారత జట్టును కాపాడి.. 2 – 2 తో ఐదు టెస్టుల సిరీస్ ని డ్రా గా ముగించిన సిరాజ్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి.. ఈ సిరీస్ లో అత్యధికంగా 23 వికెట్లు తీసి చారిత్రాత్మక ప్రదర్శన చేశాడు.


Also Read: Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

ముఖ్యంగా చివరి టెస్ట్ లో ఈ హైదరాబాది తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ గత కొన్ని సంవత్సరాలుగా అంచలంచెలుగా ఎదుగుతూ భారత జట్టులో కీలక బౌలర్ గా మారాడు. ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన మహమ్మద్ సిరాజ్.. నేడు కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడు. ఖరీదైన ఇల్లు, ఖరీదైన కార్లు, కోట్లది రూపాయలు సంపాదించాడు. అలాగే పలు బ్రాండ్ డీల్స్ ద్వారా కూడా సిరాజ్ ఆదాయం పెరుగుతూ వస్తుంది. అయితే మహమ్మద్ సిరాజ్ తాజాగా ఓ కొత్త ల్యాండ్ రోవర్ SUV ని కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో తన డ్రీమ్ కారును కొనుగోలు చేయడం గురించి తన అభిమానులకు తెలియజేశాడు.


ల్యాండ్ రోవర్ డీలర్ షిప్ నుండి మూడు కోట్ల రూపాయల ధరతో ఈ SUV ని కొనుగోలు చేశాడు. అయితే ఈ కారును కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా.. ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం మొహమ్మద్ సిరాజ్ కొన్ని లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. తన జెర్సీ నెంబర్, కారు నంబరు ఒకేలా ఉండేలా చూసుకుని.. ఈ నెంబర్ కోసం మొహమ్మద్ సిరాజ్ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు యొక్క చివరి రెండు అంకెలు, తన జెర్సీ నెంబర్ 73 ఒకే విధంగా ఉండేలా ఈ ఫ్యాన్సీ నెంబర్ ని కొనుగోలు చేశాడు.

దీంతో ఈ కారు నెంబర్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక బిసిసిఐ సెంట్రల్ కాంటాక్ట్ 2024 – 25 లో మహమ్మద్ సిరాజ్ గ్రేడ్ ఏ లో చేరాడు. ఈ కేటగిరిలో చేరిన ఆటగాళ్లకు బీసీసీఐ సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు అందిస్తుంది. దీంతో పాటు అదనంగా అతడికి మ్యాచ్ ప్రకారం ఫీజు అందుతుంది. ఇక ఒక టెస్ట్ ఆడేందుకు మహమ్మద్ సిరాజ్ 15 లక్షలు, వన్డే కోసం ఏడు లక్షలు, టి-20 కోసం మూడు లక్షల రూపాయలు అందుకుంటాడు.

Also Read: Adam Hose: క్రికెట్ లోనే తొలిసారి.. గ్రౌండ్ లో భయంకరమైన గాయం.. కాలు విరిగి.. వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

2017లో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరేంగేట్రం చేసిన మహమ్మద్ సిరాజ్.. రాజ్కోట్ లో న్యూజిలాండ్ తో జరిగిన టీ – 20 మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. అలాగే 2019 జనవరిలో ఆస్ట్రేలియా తో వన్డే మ్యాచ్, 2020 డిసెంబర్ లో ఆస్ట్రేలియా తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఓ నివేదిక ప్రకారం మొహమ్మద్ సిరాజ్ మొత్తం నికర విలువ 57 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక మహమ్మద్ సిరాజ్ కి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈ ఇంటి ధర దాదాపు 14 కోట్ల రూపాయలు ఉంటుంది.

https://www.facebook.com/share/16EXviT6ay/

Related News

Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు

Pujara on Ashwin: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా అశ్విన్ ?

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి గిల్, సిరాజ్ ఔట్… టీమిండియా తుది జట్టు ఇదే !

Samantha: సమంతకు దగ్గరైన టీమిండియా ప్లేయర్.. షాకింగ్ పోస్ట్ వైరల్ !

Nayanthara: ‘నయన్’ ఎ**ఫైర్ లిస్ట్ పెద్దదే..లిస్ట్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు ?

Big Stories

×