BigTV English

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Wild Elephant Viral Video: ఏనుగులు సాధారణంగా చాలా ప్రశాంతమైన జంతువులు. వాటికి తిక్కలేపిస్తే, ఆడపం ఎవరితరం కాదు. తన అడ్డుగా ఉన్న వాటిని తొక్కిపడేస్తాయి. తాజాగా ఏనుగుకు ఓ వ్యక్తి చిర్రెత్తే పని చేశాడు. దానితో సెల్పీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. సదరు వ్యక్తిని వెంటాడి, కాళ్లకింద వేసి నలిపేసింది. కానీ, ఆ వ్యక్తి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మనిషిని తొక్కేసిన ఏనుగు

తాజాగా ఓ వీడియో 69Thewanderlust అనే ఛానెల్ లో షేర్ చేయబడింది. ఈ వీడియో ఊటీ – మైసూర్ జాతీయ రహదారిలోని బందీపూర్ వన్యప్రాణుల కారిడార్‌ షూట్ చేశారు. ఈ రహదారిలో ఏనుగులు తరచుగా వాహనదారులకు కనిపిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా అడవి ఉండటంతో ఏనుగులు ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు తిరుగుతుంటాయి. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన కారు నుండి దిగి రోడ్డుకు అవతలి వైపు ఉన్న ఏనుగుతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఓ కారు ఏనుగు దగ్గరికి దూసుకొచ్చింది. కోపంతో ఆ ఏనుగు రోడ్డు అవతలివైపు ఉన్న అతడి వైపు వెంబడించడం ప్రారంభించింది. ఏనుగును చూసి అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడివైపు మరింత వేగంగా దూసుకొచ్చింది. రోడ్డు మీదకి వచ్చిన అతడిని తొండంతో కొట్టి రోడ్డు మీద పడేసింది. తన కాళ్లతో తొక్కుతూ వెళ్లిపోయింది.


కారులో నుంచి వీడియో చిత్రీకరణ

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కారులో ఉన్న వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే, ఈ ఘటనలో ఏనుగు దాడికి గురైన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు ఆయనకు ఐసీయూలో చికిత్స అందించారు. అయితే, ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

అడవి జంతువుల దగ్గరికి వెళ్లకూడదు!

నిజానికి ఏనుగులు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఏనుగులు విపరీతమైన కోపంతో ఉంటాయి. ఈ సమయంలో వాటికి దగ్గరగా ఉంటే ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది. ఊటీ- మైసూర్ రహదారిలో ఏనుగులు మాత్రమే కాదు, సింహాలు, పులులు కూడా సాధారణంగా కనిపిస్తుంటాయి. చాలా మంది వాటిని ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, వాటి మూడ్ బాగాలేని సమయంలో డ్రామాలు చేస్తే, సెల్ఫీ మ్యాన్ పరిస్థితే ఎదురవుతుంది. అందుకే, వీలైనంత వరకు అడవి జంతువులకు దూరంగా ఉండటం మంచిదని అటవీ అధికారులు సూచిస్తున్నారు. వాటితో ఎలాంటి డేంజర్ గేమ్స్ అడకూడదంటున్నారు. కాదని, ముందుకెళ్తే వేటతప్పదని హెచ్చరిస్తున్నారు.

Read Also: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Related News

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

Big Stories

×