IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) మార్చి 28వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ మూడు మ్యాచ్ లో కూడా చాలా ఉత్కంఠ భరితంగానే సాగాయి. ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఓనర్లు అంబానీ ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మొత్తం పది మంది ఓనర్లు ఉంటారు. కానీ ఇందులో అంబానీ ఫ్యామిలీ మాత్రం చాలా స్పెషల్. అందుకే స్టేడియంలో వాళ్ల కోసం సోఫాలు ( Sofa) వేసి మరీ కూర్చోబెడుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI). దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు (Indian Premier League 2026 Tournament) సంబంధించిన ఏ మ్యాచ్ జరిగిన కూడా నీతా అంబానీ ( Nita Ambani), ఆమె కొడుకులు అకాష్, అనంత్ కచ్చితంగా సోఫాలలోనే కూర్చుంటారు. అటు అంబానీ కూడా మ్యాచ్ చూసేందుకు వస్తే ఆయన కూడా సోఫాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. అంబానీ ఫ్యామిలీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి వాళ్లు వీఐపీ బాక్సులు, సెష్పల్ గ్యాలెరీలలో కూర్చుంటే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. దేశాన్ని కూర్చోబెట్టి పోషించే సత్తా ఉన్న ఈ కుటుంబానికి.. కేంద్ర ప్రభుత్వమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అందిస్తోంది. అందుకే డగౌట్ కు దగ్గరగానే సోఫాలు వేసి కూర్చోబెడతారు. దాని వల్ల ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు రావు. వాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
ఇక ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ప్లేయర్లతో నిత్యం టచ్ లో ఉంటారు. మ్యాచ్ గెలిచేలా.. ప్లేయర్లకు ప్రతి క్షణం దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీఐపీ బాక్సులలో కూర్చుంటే జట్టును కలిసి ముందుకు నడిపించడం కష్టం. అందుకే స్టేడియంలో సోఫాలు వేయించుకొని, ఆమె కూర్చుంటారు. దాని వల్ల ప్లేయర్లతో సమన్వయం చాలా సులభం అవుతుంది. అందుకే ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) ఇప్పటి వరకు ఐదు టైటిల్స్ గెలుచుకొని సక్సెస్ గా దూసుకు వెళ్తోంది. అయితే మిగిలిన జట్ల ఓనర్లు మాత్రం విఐపి బాక్సుల్లో కూర్చొని మ్యాచ్ తిలకిస్తారు. అంబానీ ఫ్యామిలీ లాగా ఆలోచించకుండా.. జట్టును నడిపించేందుకు ప్రత్యేకంగా కోచ్ లను నియమించుకుంటాయి. దాని వల్ల 100% రిజల్ట్ ను ఇతర ఫ్రాంచైజీలు సాధించలేవు.
Why the fk BCCI arrange Sofa for Ambanis near the ropes. When all other owners sit in VIP stands. pic.twitter.com/Rv3B5Ehn5E
— Selfless⁴⁵ (@SelflessCricket) May 26, 2025