E-Paper
Advertisement

గ‌డ్డం పెంచ‌డం త‌ప్ప, వీడికి క్రికెట్ ఆడ‌రాదు..రమీజ్ రాజా, యూసుఫ్‌ల మధ్య మాట‌ల యుద్ధం

గ‌డ్డం పెంచ‌డం త‌ప్ప, వీడికి క్రికెట్ ఆడ‌రాదు..రమీజ్ రాజా, యూసుఫ్‌ల మధ్య మాట‌ల యుద్ధం
Advertisement

Mohammad Yousuf VS Ramiz Raja: పాకిస్తాన్ టీం ( Pakistan) అంటేనే చాలా వింతగా ఉంటుంది. పాకిస్తాన్ క్రికెట్ సభ్యులు ఏది చేసినా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే ఈ పాకిస్తాన్ కు సంబంధించిన రమీజ్ రాజా ( RAMIZ RAJA), మహమ్మద్ యూసుఫ్ ( MOHAMMED YOUSUF) మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అసభ్య పదజాలంతో లైవ్ లోనే తిట్టుకున్నారు. అయితే ఈ సంఘటన పది సంవత్సరాల కింద జరగగా, ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, మహమ్మద్ యూసుఫ్‌ బండ బూతులు తిట్టుకున్నారు. ఇది చూసిన ఇండియన్ క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఇదెక్క‌డి య‌వ్వారం రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభ‌వ్ కు కూడా ల‌వ్ స్టోరీ…ఔట్ కాగానే క‌న్నీళ్లు పెట్టుకుంది క‌ద‌రా Mohammad Yousuf VS Ramiz Raja

గ‌డ్డం పెంచ‌డం త‌ప్ప, వీడికి క్రికెట్ ఆడ‌రాదు

Advertisement

పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, మహమ్మద్ యూసఫ్ ఇద్దరు కూడా సరిగ్గా 10 సంవత్సరాల కిందట టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ప్రదర్శన పైన చర్చలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒకరు పాకిస్తాన్ జట్టును పొగుడుతుంటే, మరొకరు తిట్టడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇంకేముంది లైవ్ లోనే బండ బూతులు తిట్టుకున్నారు. వాడికి గడ్డం పెంచ‌డం తప్ప క్రికెట్ ఆడటం చేతకాదని మహమ్మద్ యూసఫ్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రమీజ్ రాజా. పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని అబద్ధాలు చెప్పడం మాత్రమే మ‌హ‌మ్మ‌ద్ యూసఫ్ కు వచ్చునని మండిపడ్డారు. చేతకాని దద్దమ్మ అంటూ రెచ్చిపోయారు.

రమీజ్ రాజా, యూసుఫ్‌ల మధ్య మాట‌ల యుద్ధం

అయితే, అదే స్థాయిలో రమీజ్ రాజాకు ( Ramiz Raja) కూడా మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf ) కౌంటర్ ఇచ్చాడు. ఈ ర‌మీజ్ రాజా గాడికి ఇంగ్లీష్ తప్ప, క్రికెట్ గురించి ఏం తెలుసు ? అంటూ మండిపడ్డారు. క్రికెట్ గురించి తెలియదు కానీ ఇంగ్లీష్ లో ఏదో వాగుతూ ఉంటాడని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు మహమ్మద్ యూసఫ్. ఆ తర్వాత సిగ్గులేనోడా.. ? పిరికివాడా ? అంటూ ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. గల్లీలో రౌడీలు తిట్టుకున్నట్లుగానే లైవ్ లోనే రెచ్చిపోయారు రమీజ్ రాజా అలాగే మహమ్మద్ యూసఫ్. ఈ సంఘటన 10 సంవత్సరాల కిందట జరగగా ఇప్పుడు వైరల్ గా మారింది. రమీజ్ రాజా అలాగే మహమ్మద్ యూసఫ్ మ‌ధ్య జ‌రిగిన ఈ వీడియో చూసిన జ‌నాలు న‌వ్వుకుంటున్నారు.

Advertisement

Also Read: Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు

 

 

 

 

Related News

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

Big Stories

Advertisement
×