Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో( Indian Premier League 2026 Tournament) భాగంగా వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi ) పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. బుమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ కుమార్ వరకు అందరూ తోపు బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అయితే సోమవారం రోజున హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మనోడు కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకున్నారు. కానీ, తొలి బంతుకే గోల్డెన్ అకౌట్ అయ్యాడు వైభవ్. దీంతో అతని అభిమానులు అందరూ నిరాశ చెందారు. ముఖ్యంగా ఓ 15 ఏళ్ల చిన్నారి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది. దీంతో ఆ చిన్నారి వైభవ్ సూర్య వంశీ ప్రియురాలు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది రచ్చ రచ్చ చేస్తున్నారు.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ ఫైట్ నిన్న జరిగింది. ఈ మ్యాచ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్, 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 216 పరుగులు సాధించిన సన్రైజర్స్ ను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇరగదీస్తాడని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ, వైభవ్ సూర్య వంశీ మాత్రం మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో అతని బ్యాటింగ్ చూడాలనుకున్న అభిమానులు అందరూ నిరాశ చెందారు. స్టేడియానికి వచ్చిన ఓ పదిహేను సంవత్సరాల అమ్మాయి కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ చిన్నారి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన జెర్సీతో ఈ మ్యాచ్ సందర్భంగా మెరిసింది. రాజస్థాన్ రాయల్స్ ఆడే ప్రతి మ్యాచ్ కూడా ఈ చిన్నారి హాజరవుతోంది. ఇక హైదరాబాద్ పైన వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపుతాడని భారీ అంచనాలు పెట్టుకున్న చిన్నారి, రాజస్థాన్ నుంచి వచ్చిందని అంటున్నారు. కానీ వైభవ్ మాత్రం నిరాశ పరిచాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంది ఈ చిన్నారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా లవ్ స్టోరీ ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) క్లాస్మెట్ ఈ అమ్మాయి అంటూ కొంతమంది ర్యాగింగ్ కూడా చేస్తున్నారు. అందుకే ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుందని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. వీళ్లు లవర్స్ అని కూడా కొంతమంది ఆడుకుంటున్నారు.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
?igsh=aDN5a29vMXluaGk5
?igsh=MTA5M3RtMTB2aTE1cA==