E-Paper
Advertisement

‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్

‘ధైర్యముంటే కొండగల్ రా.. సీఎం పవర్ ఏంటో చూపిస్తా’! జగదీష్ రెడ్డికి వేముల వీరేశం సవాల్
Advertisement

Vemula Veeresham: సిఎల్పీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. జిల్లా అభివృద్ధిలో జగదీశ్వర్ రెడ్డి పాత్ర ఏమీ లేదని, ఆయన ఒక జీరో అని ఎద్దేవా చేశారు.

అసత్య ఆరోపణలు – సెల్ఫ్ గోల్

Advertisement

ముఖ్యమంత్రిపై, ఇరిగేషన్ మంత్రిపై జగదీష్ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలను వీరేశం తీవ్రంగా ఖండించారు. ఆయన వెకిలి చేష్టలతో మాట్లాడిన తీరు, సొంత గోల్ కొట్టుకున్నట్లే ఉందని విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విద్వంసాన్ని, తెలంగాణ సమాజానికి చేసిన నష్టాన్ని కప్పి పుచ్చుకోవడానికే ఈ నాటకాలని మండిపడ్డారు.

విద్యుత్ శాఖ వైఫల్యాలు

Advertisement

గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కమిషన్లు దండుకోవడంలోనే జగదీష్ రెడ్డి బిజీగా ఉన్నారని, ఏనాడూ శాఖపై రివ్యూలు చేయలేదని ఆరోపించారు. సింగరేణిపై నిజమైన ప్రేమ ఉంటే, విదేశీ బొగ్గు కోసం ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఛత్తీస్‌గఢ్ నుండి ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారో, దాని వెనుక ఉన్న లోపాయకారీ ఒప్పందమేంటో ప్రజలకు వివరించాలన్నారు.

అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు

అధిక డిమాండ్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కన్నా తక్కువ ధరకే తాము విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని వీరేశం స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే యాదాద్రి పవర్ ప్లాంట్ ఫంక్షనింగ్‌లోకి వచ్చిందని గుర్తుచేశారు. కొత్త టెక్నాలజీతో 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు, రైతులకు చివరి గుంట వరకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు.

కొండగల్‌కు రావాలని సవాల్

తనను తాను మేధావిగా భావించే జగదీష్ రెడ్డి, నల్గొండలో ఎన్ని మున్సిపల్ స్థానాలు గెలిచారో గుర్తుచేసుకోవాలన్నారు. ధైర్యం ఉంటే కొండగల్‌కు రావాలని, అక్కడి ప్రజలు సీఎంను ఎలా ఆదరిస్తున్నారో చూస్తే ఆయన తీరు మారుతుందని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేసి దోచుకున్న జగదీష్ రెడ్డి చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Also Read: ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క కీలక సమీక్ష.. ప్రధాన నిర్ణయాలు ఇవే!

Tags

Related News

హైదరాబాద్ ‘సిటీ’వాసులకు సూచన.. కేవలం రూ.600 లకే బస్సు పాస్, ఇంకెందుకు ఆలస్యం

హైదరాబాద్‌లో నీటి వృథాపై నిఘా.. నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే రూ. 5 వేలు ఫైన్

ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క కీలక సమీక్ష.. ప్రధాన నిర్ణయాలు ఇవే!

కాసానికి లైన్ క్లియర్! బీసీ కార్డ్‌తో ఎమ్మెల్సీ బరిలోకి గులాబీ పార్టీ?

బీ కేర్ ఫుల్!.. ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. సైబరాబాద్‌ కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్!

హైదరాబాద్ లో టెక్కీ ఆత్మహత్య.. ఉదయం ఆఫీసు.. రాత్రికి ఇంట్లో ఉరి, మృతురాలు సొంతూరు..

రైస్ మిల్లర్లపై సీఐడీ ఉక్కుపాదం.. జమ్మికకుంట, ములుగుల్లో అరెస్టులు!

Big Stories

Advertisement
×