E-Paper
Advertisement

MLA Disqualification Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్.. స్పీకర్‌కు చివరి అవకాశం!

MLA Disqualification Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్.. స్పీకర్‌కు చివరి అవకాశం!
Advertisement

MLA Disqualification Case: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అసెంబ్లీ స్పీకర్‌ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఈపాటికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఇకనైనా నిర్ణయం తీసుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.  ఇప్పటికే కొందరికి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ముగ్గురు ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలకు సంబంధించి రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది.

Advertisement

విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులు.. ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయడానికి నాలుగు వారాల సమయం కావాలని కోరారు. అయితే, రెండు వారాల్లో ప్రగతి చూపిస్తేనే, మిగిలిన నాలుగు వారాల సమయం గురించి ఆలోచిస్తామని సుప్రీంకోర్టు తెల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read Also: ప్రియుడితో కలిసి హోటల్‌లో.. భర్తకి చిక్కిన భార్య, చివరకు భర్తపై చిందులు, వీడియో వైరల్

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×