Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కేవలం సినీ ప్రేక్షకులకే కాదు దిగ్గజాలకు కూడా ఫేవరెట్ హీరోయిన్స్ అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే దివంగత నటీమణి శ్రీదేవి అంటే సినీ ప్రేమికులే కాదు దుబాయ్ వ్యాపారవేత్తలు కూడా ఆమె అంటే పడి చచ్చేవారట. అంతేకాదు ఒకానొక సమయంలో ఆమెతో కరచాలనం చేయడానికి ఏకంగా బంగ్లాలు రాసిచ్చిన వారు కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు వినిపించేవి. ఇక ఇప్పుడు ఒక తెలుగు నటి కోసం ఏకంగా ధీరుభాయి అంబానీ కూడా భారీగా ఆస్తులు రాసిచ్చినట్లు సమాచారం.. దీనిపై ఆమె స్వయంగా స్పందించింది కూడా.. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆమె ఎవరో కాదు ప్రముఖ తెలుగు నటీమణి జయలలిత.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అప్పట్లో ఎక్కువగా గ్లామర్ డోస్ ఉండే వాంప్ పాత్రలలోనే నటించేవారు . ఆ తర్వాత మెల్లగా తన ఇమేజ్ను మార్చుకొని.. మంచి రోల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. భరత్ అనే నేను సినిమాలో కూడా స్పీకర్ పాత్రలో కనిపించిన ఈమె..ఈమధ్య ఓరి దేవుడా, రంగమార్తాండ వంటి సినిమాలలో కూడా కనిపించారు. అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధీరుభాయ్ అంబానీ తనకు ముంబై, మాంచెస్టర్ వంటి ప్రాంతాలలో ఇచ్చిన ఫ్లాట్లను తిరిగి ఇచ్చేసిన వైనం , ఆ తర్వాత నిర్మాత అనిల్ గణపతి రాజు కారణంగా 4 కోట్లు ఎలా మోసపోయింది అనే విషయాన్ని వివరించింది.
“పోయిన జన్మలో నేను వాడిది తిని ఉంటాను. వాడికి రుణం అయి ఉంటుంది పోనీ అని భావించి.. 4కోట్లు నష్టపోయాను అనే విషయాన్ని నేను వదిలేసాను. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మే నేను నా డబ్బును పోగొట్టుకున్నా.. ఇప్పటికీ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాను. భగవంతుడు అవకాశం ఇస్తే శరత్ బాబు పేరు మీద మంచి పనులు చేయాలనుకుంటున్నాను” అంటూ తెలిపింది. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనిల్ తనకు రెమ్యూనరేషన్, వడ్డీ ,అసలు కూడా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.. ఇక సినిమా షూటింగులు ఆగిపోకుండా ఉండేందుకు తన సంచుల్లో డబ్బులు పెట్టుకొని ఇచ్చేదాన్ని.. నన్ను చూసి ఇతర నటీనటులు డబ్బు మదం.. కుక్కకు బిస్కెట్లు విసిరినట్టు విసిరేస్తోంది అని మాట్లాడుకున్నా.. ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. నేను మోసపోయిను. తర్వాత క్రైమ్ సెంట్రల్ స్టేషన్ చుట్టూ 6 నెలలు తిరిగాను. వారు అనిల్ ను అరెస్టు చేసినా.. ఆ తర్వాత డబ్బులు తీసుకొని వదిలేసారు. అవినాష్ మహంతి అనే అధికారిని నేను ప్రశ్నించగా..” మోసం చేయడం తెలిసిన నీకు కూడా మోసం చేసి సంపాదించడం తెలిస్తే సంపాదించు” అని నాతో అన్నారు. ఇక దాంతో నేను ఆ రోజు నుంచి మళ్లీ సిసిఎస్ గడప తొక్క లేదు అంటూ తెలిపింది
ఇక అలాగే ధీరుభాయ్ అంబానీ తనకు ఇచ్చిన ముంబైలో ఒక ఫ్లాట్ , యునైటెడ్ కింగ్డమ్ లోని మాంచెస్టర్ లో మరొక ప్లాట్ ను బహుమతిగా ఇచ్చారు .అయితే ఆయన మరణాంతరం ఆస్తులను తిరిగి ఇచ్చేశాను. పరాయి సొమ్ము పాము లాంటిది.. ఆయన పోయిన తర్వాత మనం ఆ సొమ్ము ఉంచుకోకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మాను. అందుకే అంబానీ సెక్రటర్ కి ఆ పేపర్ లని అప్పచెప్పాను. ధీరుభాయ్ అంబానీ ముంబైలో నాకిచ్చిన ఫ్లాట్ ను కొన్ని రోజులు అద్దెకు ఇచ్చాను. నెలకు 40,000 అద్దె వచ్చేది. నేను ముంబై వెళ్ళినప్పుడు ఆ ఫ్లాట్లో ఒక గదిలో ఉండేదాన్ని. ఈ విషయం ఇంతకుముందు ఎవరికీ తెలియదు. ఇక ఆత్మగౌరవంతో నా సంపాదనతో మాత్రమే బ్రతకాలని నిర్ణయించుకొని ఆ ఆస్తులు వారికి వెనక్కి ఇచ్చేశాను అంటూ తెలిపింది.
also read: Poonam Kaur: పవన్ కళ్యాణ్ పరువు తీసిన పూనమ్.. ఈ సారి ఏకంగా మతం పేరుతో!