E-Paper
Advertisement

CM Revanth vs Lionel Messi: సీఎం రేవంత్ మనమడితో మెస్సీ ఫుట్‌బాల్

CM Revanth vs Lionel Messi: సీఎం రేవంత్ మనమడితో మెస్సీ ఫుట్‌బాల్
Advertisement

CM Revanth vs Lionel Messi:  ఉప్పల్ స్టేడియంలో దిగ్గజ ఫుట్ బాల్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) మేనియా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయంలో హైదరాబాద్ వచ్చిన లియోనెల్ మెస్సీ, ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మొదట సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్ బాల్ ఆడిన లియోనెల్ మెస్సీ, ఆ తర్వాత ఆయన మనమ‌డితో కూడా సరదాగా ఆడారు. ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత గ్రౌండ్ లో సరదాగా లియోనెల్ మెస్సీ గడిపారు. ఈ నేపథ్యంలోనే తన మనవడిని తీసుకువచ్చి లియోనెల్ మెస్సీతో ఫుట్ బాల్ ఆడించారు సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy). ఇక సీఎం రేవంత్ రెడ్డిని మించిపోయి ఆయన మనువడు ఫుట్ బాల్ ఆడారు. లియోనెల్ మెస్సీకి నేరుగా బంతిని పంపిస్తూ సంద‌డి చేశాడు సీఎం రేవంత్ రెడ్డి మ‌న‌మ‌డు. చిన్నోడైన అద్భుతంగా ఆడాడు అని ఆ కుర్రాడిని ప్రశంసించారు లియోనెల్ మెస్సీ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

సీఎం రేవంత్ గోల్.. మెస్సీ చప్పట్లు

Advertisement

ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన వెంటనే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సందడి చేశారు. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ గ్రౌండ్ మొత్తం తిరిగారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సీకి సంబంధించిన రెండు జట్లు కూడా పెనాల్టీ షూట్ ఔట్ లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పెనాల్టీ షూట్ ఔట్ లో భాగంగా అదిరిపోయే గోల్ కూడా కొట్టాడు. ఆ గోల్ చూసిన లియోనెల్ మెస్సీ షాక్ అయ్యాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆట‌తీరును ప్రశంసిస్తూ చప్పట్లు కూడా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మ్యాచ్ పూర్త‌యిన త‌ర్వాత సీఎం రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి జెర్సీ నం.10ని బహుకరించారు లియోనెల్ మెస్సీ.

ఉప్పల్ స్టేడియంకు రాహుల్ గాంధీ, ప్ర‌ముఖులు

‘మెస్సీ vs  సీఎం రేవంత్ రెడ్డి’ ఫ్రెండ్లీ మ్యాచ్ చూసేందుకు.. ఉప్పల్ స్టేడియంకు ( Uppal Stadium) క్యూ కట్టారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇంకా ఇతర మంత్రులు హాజరు అయ్యారు. అటు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) కూడా వ‌చ్చి, ‘మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి’ ఫ్రెండ్లీ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశారు.

Advertisement

 

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×