E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 97 : సంజనాపై తనూజ రివేంజ్ ప్లాన్ ను బయట పెట్టిన నాగార్జున… రిగ్రెట్ వీక్ లో సర్ప్రైజ్ గెస్ట్… సుమన్ అవుట్

Bigg Boss 9 Telugu Day 97 : సంజనాపై తనూజ రివేంజ్ ప్లాన్ ను బయట పెట్టిన నాగార్జున… రిగ్రెట్ వీక్ లో సర్ప్రైజ్ గెస్ట్… సుమన్ అవుట్
Advertisement

Bigg Boss 9 Telugu Day 97 : బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారాంతం వచ్చేసింది. నాగార్జున ఎనర్జిటిక్ ఎంట్రీ తర్వాత శుక్రవారం ఏం జరిగిందో చూపించారు. కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి వచ్చిన తనూజ ప్రైజ్ మనీ నుంచి డబ్బులు కట్ చేస్తానని బిగ్ బాస్ అన్నారు కాబట్టి నేను ఇమ్యూనిటీ వద్దు అన్నాను అని చెప్పింది. దీంతో ఇంత కష్టపడి ఎందుకు వద్దు అన్నావ్ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. హౌస్ మేట్స్ అందరూ అదే మాట అన్నారు. తర్వాత హౌస్ మేట్స్ అందరినీ పలకరించిన నాగ్… రీతూ వెళ్ళిన తరువాత అందరితో ఇంటరాక్ట్ అవుతున్నావు. హాయిగా నవ్వుతున్నావు అని డెమోన్ తో అన్నారు. “నిజమే సార్… చాలా సంతోషంగా ఉన్నా” అని ఒప్పుకున్నాడు డెమోన్. “దొరికావ్ లే బయటకు వెళ్ళాక” అని అన్నారు నాగ్. “ఇంకా రమ్య, ఆయేషా ఉంటే రచ్చ రంబోలా ఉండేది అన్నాడు సార్” అని డెమోన్ ను ఇరికించింది సంజన.

ట్రస్ట్ టాస్క్… ఎవరు ఎవరికి ? 

తర్వాత ట్రస్ట్ చేసే వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్, ట్రస్ట్ చేయని వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలని చెప్పారు నాగ్. సంజన వచ్చి ఇమ్ముకి గ్రీన్, తనుజతో మొదటి నుంచి పెద్దగా బాండ్ లేదు. ఈ వీక్ ఇంకా హార్డ్ గా ఉంది అంటూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. భరణి సుమన్ కు గ్రీన్, డెమోన్ కు రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. “సుమన్ కు గ్రీన్ ఇచ్చావ్. అయితే ఈ వీడియో చూడు” అంటూ నాగార్జున భరణి – సుమన్ ఫన్నీ మూమెంట్స్ ఉన్న ఫ్రెండ్షిప్ వీడియోను ప్లే చేశారు. డెమోన్ ఇమ్మూకి గ్రీన్, భరణి రెండుసార్లు ఇచ్చిన మాట తప్పాడు అంటూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. కళ్యాణ్ తనూజకు గ్రీన్, మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చాయి కదా అంటూ డెమోన్ కు రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. వాడు చేస్తే గేమ్, మేము చేస్తే దెబ్బ అని పంచ్ వేశాడు డెమోన్. ఒరిజినల్ పవన్ మాకు ఇన్నాళ్లకు కనబడ్డాడు అని నాగ్ కౌంటర్ వేశారు. తనూజా గ్రీన్ కళ్యాణ్ కు, రెడ్ సంజనాకు ఇచ్చింది. ఆమె మాట మార్చడంతో తాను కూడా మాట మార్చాను అని చెప్పింది. అంతేకాదు సంజన నామినేషన్ లో ఇమ్మూ, తనూజ ఇద్దరూ ఉన్నారు. కానీ బాండ్ కారణంగా ఇమ్మూను వదిలేసి, తనూజను నామినేట్ చేస్తాను అని చెప్పడంతో ఆమెను గేమ్ నుంచి తీసేశానని వివరణ ఇచ్చింది. మరి 3 లక్షలు కట్ అంటే ఇమ్యూనిటీ వద్దు అన్నావ్. ఇప్పుడు 5 లక్షలు కట్ ఈ టాస్క్ ఆడితే అని షాక్ ఇచ్చారు నాగ్. అందరం ఇక్కడిదాకా కష్టపడి ఆడి వచ్చాము. కాబట్టి ప్రైజ్ మనీ కట్ అవ్వడం ఇష్టం లేదని చెప్పింది తనూజ.

Advertisement

బిగ్ బాస్ 9లో ఫినాలేకు ముందు చివరి వీక్ ఇదే కాబట్టి ఇండియన్ పాప్ స్మిత సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. తన సాంగ్ కు ర్యాపర్  నోయెల్, కొరియోగ్రాఫర్ బిన్నీ మాస్టర్ తో కలిసి లైన్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ‘ఓజీ క్వీన్’ సాంగ్ ను నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేయించి, వరల్డ్ టూర్ ను ప్రకటించింది.

రిగ్రెట్ వీక్

“అక్కడున్న రిగ్రెట్ స్టాంప్ ను ఇష్టం లేని వీక్ పై వేసి, ఎందుకో చెప్పాలి” అంటూ మరో టాస్క్ ఇచ్చారు నాగార్జున. తనూజా వీక్ 7పై స్టాంప్ వేసి… భరణి సార్ ఎలిమినేట్ అయిన వీక్. ఆయన వెళ్ళిపోగానే అది తీసుకోలేకపోయాను. నేను లో అయిపోతానేమో అని భయం వేసింది అని చెప్పింది. సుమన్ వీక్ 10లో నిఖిల్ ను నామినేట్ చేయడం, ఆయన వెళ్ళిపోవడం రిగ్రెట్ అన్పించిందని చెప్పింది. డెమోన్ వీక్ 6లో రీతూతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది నచ్చలేదు. అలా కాకుండా వేరేలా మాట్లాడి ఉండాల్సింది అన్నాడు. ఇమ్ము వీక్ 7లో స్లిప్పులు ఇచ్చినప్పుడు తనూజను నామినేట్ చేయమని కళ్యాణ్ కు ఇవ్వలేదు. వాడే చేస్తా అన్నాడు కాబట్టి ఇచ్చాను. అదెక్కడో మిస్ అండర్స్టాండ్ అయ్యింది అని చెప్పాడు. కళ్యాణ్ వీక్ 7లో చాలా జరిగాయి, తనూజ పడిపోయింది అని చెప్పాడు, భరణి వీక్ 5లో శ్రీజను బెడ్ పై నుంచి బయటకు తోసాను. బయటకు వెళ్ళాక కూడా అదే బాధ ఉంటది. శ్రీజకు అందరి ముందే సారీ చెప్తున్నా అంటూ మనస్పూర్తిగా సారీ చెప్పాడు. సంజన వీక్ 11లో రీతూతో జరిగిన గొడవ, ఆమె బయటకు వెళ్లేటప్పుడు 100, 1000 సార్లు సారీ చెప్పాను అని క్లారిటీ ఇచ్చింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు నాగార్జున. అందులో భాగంగా శనివారం ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసి బయటకు పంపారు.

Advertisement

Read Also : తనూజా కోసం సంజనాకు అన్యాయం… భరణి నిర్ణయానికి బలి… ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×