Vaibhav VS Tilak Varma: దిలీప్ ట్రోఫీ 2026 ఫైనల్ (Duleep Trophy 2026) మ్యాచ్ చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో తిలక్ వర్మ, 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాటిగా బ్యాటింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ ఏకాగ్రతను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు తిలక్ వర్మ (Tilak Varma). అయితే ఇది గమనించిన వైభవ్ సూర్యవంశీ… చాలా సీరియస్ గా తిలక్ వర్మ పైకి దూసుకు వెళ్ళాడు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని.. దా తన్నుకుందాం అన్నట్లుగా దూకుడుగా వ్యవహరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతుంది.
దిలీప్ ట్రోఫీ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈస్ట్ జోన్ వర్సెస్ సౌత్ జోన్ (East Zone vs South Zone, Final) మధ్య కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చెన్నై (MA Chidambaram Stadium, Chennai) వేదికగా ఈ మ్యాచ్ షురూ అయింది. ఇందులో ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. ఈ సందర్భంగా బ్యాటింగ్ కు దిగిన ఈస్ట్ జోన్ దాటిగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేసింది. వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 44 పరుగులు కూడా చేశాడు. ఈ సందర్భంగా అతడి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ.
ఇది గమనించిన వైభవ్ సూర్యవంశీ… తిలక్ వర్మతో గొడవకు దిగాడు. దీంతో మ్యాచ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. అంతలోనే అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. వైభవ్ సూర్యవంశీకి ఉన్నంత బలుపు ఎవరికీ లేదని కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ఇంత కోపం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విదేశీ క్రికెటర్లపై ప్రదర్శించిన కోపాన్ని తోటి ఇండియన్ క్రికెటర్ పై చూపిస్తే ఎలా అంటూ నిలదీస్తున్నారు.
ఇలాంటి వైభవ్ పై కచ్చితంగా బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. దిలీప్ ట్రోఫీ 2026 టోర్నమెంట్ లో భాగంగా జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా లంచ్ బ్రేక్ సమయం వరకు 27 ఓవర్లు ఎదుర్కొంది ఈస్ట్ జోన్. ఈ క్రమంలో రెండు వికెట్లు నష్టపోయిన ఈస్ట్ జోన్ జట్టు 133 పరుగులు సాధించింది. ప్రస్తుతం శిఖర్ మోహన్ అలాగే సుదీప్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నారు. వైభవ్ 44 పరుగులు చేయగా అభిమన్యు ఈశ్వరన్ 72 పరుగులతో రాణించాడు.
🔴POOR BEHAVIOUR BY TILAK VERMA AGAINST VAIBHAV SURYAVANSHI🤦
Tilak Varma has not done well as a captain in the first two hours of game in Duleep Trophy final.
– Vaibhav & Abhimanyu Easwaran exposed his captaincy.
– frustrated & lost Tilak Varma trying to break partnership by… pic.twitter.com/u8vDgfrFHA
— Sam (@cricsam02) September 6, 2026
Captain Tilak Varma feeling the heat in Chennai! 🥵🔥
He kept the field defensive after East Zone made a solid start and also shared some fiery looks with Vaibhav Sooryavanshi! 👀#EZvSZ #DuleepTrophy #Final #Sportskeeda pic.twitter.com/Ns6XB3ajE0
— Sportskeeda (@Sportskeeda) September 6, 2026