Travis Head Wicket: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న మరో కీలక మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Mumbai Indians vs Sunrisers Hyderabad) నిన్న మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 243 పరుగుల టార్గెట్ పెట్టినప్పటికీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ గెలిచారు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
నిన్న 76 పరుగులు సాధించిన హెడ్, క్యాచ్ ఔట్ అయినప్పటికీ.. అంపైర్లు ప్రకటించలేదు. అటు ముంబై ఇండియన్స్ కూడా దీనిపై రివ్యూకు వెళ్లలేదు. దీంతో లైఫ్ లభించిన ట్రావిస్ హెడ్, 76 పరుగులతో అదరగొట్టాడు. ఈ తరుణంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Mumbai Indians vs Sunrisers Hyderabad) మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ టోర్నమెంట్ లో ప్రతిదీ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచ్ లో హెడ్ ( Travis head) ఔట్ అయినప్పటికీ.. ముంబై ఇండియన్స్ కావాలనే రివ్యూ తీసుకోలేదని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఐపీఎల్ లో ఇలా ఆరోపణలు.. వస్తే, భవిష్యత్తులో టోర్నమెంట్ ను చూసేవాడు ఉండడని మండిపడుతున్నారు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Mumbai Indians vs Sunrisers Hyderabad) జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడి ఐదు వికెట్లు నష్టానికి 243 పరుగులు సాధించింది. ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (Ryan Rickelton) సూపర్ సెంచరీ చేసి ఇరగదీశాడు. ఏకంగా 123 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. 243 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్… 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. అభిషేక్ శర్మ 45 పరుగులు సాధించగా… హెడ్ ఫామ్ లోకి వచ్చాడు. లైఫ్ లు చాలా వచ్చిన నేపథ్యంలో హెడ్ ఎనిమిది సిక్సర్లు, నాలుగు బౌండరీలు సాధించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో 76 పరుగులు బాదేశాడు హెడ్. మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్ డకౌట్ అయినప్పటికీ..హెన్రిచ్ క్లాసెన్ 65 పరుగులతో రెచ్చిపోయాడు. చివరలో సలీల్ అరోరా 30 పరుగులు చేశాడు. ఈ దెబ్బకు హైదరాబాద్ విజయం సాధించింది.
?igsh=MW5sM2NvM2I3dnBreA==