BigTV English

Bipasha Basu: బిపాషా బసు అరాచకం… ఆ ప్లేయర్ తో ఘాటు రొమాన్స్.. !

Bipasha Basu: బిపాషా బసు అరాచకం… ఆ ప్లేయర్ తో ఘాటు రొమాన్స్.. !

Bipasha Basu:  బాలీవుడ్ సినీ నటి బిపాషా బసు (Bipasha Basu) ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ చిన్నది జనవరి 7, 1979లో బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి హిరాక్ సివిల్ ఇంజనీర్, తల్లి మమత గృహిణి. ఇక బిపాషాకు ఓ అక్క చెల్లెలు కూడా ఉన్నారు. బిపాషా బసుకు 8 ఏళ్ల వయసు వచ్చేవరకు వీరు ఢిల్లీలోనే ఉన్నారు. అనంతరం కొలకత్తాకు వచ్చారు. 1996లో బిపాసా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.


Also Read: Team India: ప్రభాస్ హీరోయిన్ తో డేటింగ్‌ టీమిండియా ప్లేయర్ డేటింగ్…ఆ హోటల్ కు వెళ్లి మరీ !

గోద్రెజ్ సింతాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో బిపాషా బసు విజయం సాధించింది. అనంతరం దినో మోరియాతో ఈ చిన్నది ప్రేమలో పడింది. ఇక బిపాసా మోడల్ గా ఉన్న సమయంలో వినోద్ కన్నా కళ్ళలో పడ్డ బిపాషా బసుకు ఆయన హిమాలయ పుత్రలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2001లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరి దొంగ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మకాంను ముంబైకి మార్చిన బిపాసా వరుస పెట్టి సినిమాలలో నటించింది. అప్పటి సెక్సీ బాంబ్ మల్లికా శెరావత్ ను మించి ఈ చిన్నది అందాలను ఆరబోసి కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.


బిపాషా బసు అరాచకం…రోనాల్డో తో ఘాటు రొమాన్స్.. !

ఇదిలా ఉండగా…. బిపాషా బసు క్రిస్టియానో రోనాల్డో చాలా మంచి స్నేహితులు. కానీ వీరిద్దరూ 2007 సంవత్సరంలో జరిగిన ఓ పార్టీలో చాలా క్లోజ్ గా ముద్దు పెట్టుకున్న ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను ఈ బ్యూటీ ఖండించింది. కేవలం ఆ ఫోటో కారణంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ బిపాసా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. రోనాల్డో ఆమెకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పింది.

Also Read: Morkel vs Arshdeep : గ్రౌండ్ లోనే WWE ఆడుతున్న ప్లేయర్లు.. మోర్కల్ పై అర్ష్ దీప్ దాడి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

రోనాల్డో తన ఫుట్ బాల్ మ్యాచ్ లకు తనను ఇన్వైట్ చేస్తాడని చెప్పింది. ఆ తర్వాత వీరిద్దరిపై వస్తున్న అనేక రకాల వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఆ తర్వాత వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అని అంతా అనుకున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతను అభిమానులతో షేర్ చేసుకోగా అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతాయి.

Related News

Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?

Adam Hose: క్రికెట్ లోనే తొలిసారి.. గ్రౌండ్ లో భయంకరమైన గాయం.. కాలు విరిగి.. వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

Asia Cup 2025: ఖతం, టాటా, బై బై… రిజ్వాన్, బాబర్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ప్రకటన..!

Jordan Cox: జోర్డాన్ కాక్స్ అరాచకం… ఒక్కో బంతికి 300… 10 సిక్సర్లు, 3 ఫోర్స్

CSK Biryani Restaurant : CSK అంటే మామూలుగా ఉండదు.. ధోని పేరుతో బిర్యానీలు

Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!

Big Stories

×