Morkel vs Arshdeep : ఇంగ్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతోంది. జులై 02 నుంచి బర్మింగ్ హామ్ వేదిక గానే ప్రారంభం కానున్న రెండో టెస్ట్ లో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్ కి టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడనే వార్తలు అభిమానులకు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. వాస్తవానికి ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్ బౌలింగ్ ఆశలన్నీ బుమ్రా పైనే నిలిచాయి. కానీ బుమ్రా రెండో టెస్టుకు దూరం కానున్నట్టు సమాచారం. మరోవైపు తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : Case on Yash Dayal : యష్ దయాళ్ పై కేసు నమోదు…పెళ్లి పేరుతో లేడీని వాడుకొని !
మోర్కెల్ వర్సెస్ అర్ష్ దీప్ ఫైట్..
టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ భారత బౌలర్ ఆర్షదీప్ సింగ్ ఫన్ WWE ఫైటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక భారత బౌలర్ బుమ్రా వెళ్లి.. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ వస్తాడనే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా బుమ్రా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తన అంచనాలను అందుకోలేకపోయాడు. మొదటి టెస్టులో 5 వికెట్లు తీసిన బుమ్రా.. రెండో టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. దీంతో టీమిండియా కి ఓటమి తప్పడం లేదు. టెస్టు ఫార్మాట్ లో టీమిండియా పూర్తిగా బుమ్రా పైనే ఆధారపడుతోంది. మహమ్మద్ షమీ ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరం కావడంతో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ఇక ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభానికి ముందే బుమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడుతాడని టీమిండియా కోచ్ గంభీర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
అర్ష్ దీప్ సింగ్ ఎంట్రీ ఖాయమేనా..?
ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా మ్యాచ్ లు ఆడి గాయపడటంతో అతని వర్క్ లోడ్ ను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రాకు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతిని ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ మూడో టెస్ట్ మ్యాచ్ కి బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. బుమ్రా స్థానంలో రెండో టెస్ట్ ఆడేది ఎవరు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అర్షదీప్ సింగ్ టెస్ట్ మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు బౌలింగ్ కోచ్ మోర్కెల్ తో ఫైటింగ్ చేయడమే ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. వాస్తవానికి ఇంగ్లాండ్ స్వింగ్ కండిషన్స్.. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ కు సరిగ్గా సరిపోతుంది. తొలి టెస్టులో విఫలం చెందిన శార్దూల్ ఠాకూర్ పై వేటు వేసే అవకాశం ఉంది. ఈ స్థానంలో ఆకాశ్ దీప్, నితీస్ కుమార్ రెడ్డిలు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా నెట్స్ లో అర్ష్ దీప్ సింగ్ ఎక్కువగా సాధన చేసుండటంతో అతనే ఎక్కువగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నట్టు సమాచారం.
WWE kinda kalesh b/w Arshdeep Singh and Morne Morkel
pic.twitter.com/onr9pEI5jU— Ghar Ke Kalesh (@gharkekalesh) June 28, 2025