HHVM: హైదరాబాదులో ఇప్పటికే ఎన్నో అధునాతన సౌకర్యాలతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ (Suneil Narang)పలువురు హీరోలతో కలిసి ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ఎంతోమంది హీరోలతో భాగ్యస్వామ్యం అవుతూ మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మించారు. అతి త్వరలోనే హీరో రవితేజతో(Raviteja) కలిసి ఓ మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే ఈ మల్టీప్లెక్స్ థియేటర్ జూలైలో ప్రారంభం కాబోతుందని ఇటీవల కుబేర సినిమా ప్రమోషన్లలో భాగంగా సునీల్ నారంగ్ తెలిపారు.
అధునాతన సౌకర్యాలతో..
హైదరాబాద్ లో మరికొద్ది రోజులలో ఆసియన్ రవితేజ సినిమాస్ (ART cinemas) ప్రారంభం కాబోతున్నట్లు ఈయన తెలియజేశారు కానీ ఇంకా అధికారిక తేదీ మాత్రం వెల్లడించలేదు. ఈ మల్టీప్లెక్స్ థియేటర్ అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు అయింది.57 అడుగుల వెడల్పు గల భారీ EPIQ స్క్రీన్, 4K ప్రొజెక్షన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో కూడిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన సినిమా విడుదల కాబోతుందని, అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి.
ప్రారంభోత్సవ చిత్రంగా వీరమల్లు..
ఇలా ప్రేక్షకులకు ఎంతో సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ థియేటర్ జూలై నెలలో ప్రారంభం కాబోతుంది అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా కూడా జూలై 24వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. అయితే ART ప్రారంభమైన వెంటనే ఆ మల్టీప్లెక్స్ లో హరిహర వీరమల్లు ప్రసారమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇదే కనుక నిజమైతే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవ చిత్రంగా హరిహర వీరమల్లు సినిమా రికార్డ్ సృష్టిస్తుందని చెప్పాలి.
ART సినిమాస్..
పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా చారిత్రాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏ. యం రత్నం భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. జూన్ 12వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా ఎడిటింగ్ పనులు పూర్తి కాకపోవడంతోనే జూలై 24వ తేదీకి వాయిదా వేశారు. ఈ సినిమా విడుదల సమయానికి ART మల్టీప్లెక్స్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ మల్టీప్లెక్స్ లో ప్రసారం చేయడానికి వీరమల్లు చిత్రం ఎంతో సరైనదని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏంటి అనే విషయాలు అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.
Also Read: Venky Atluri: వెంకీ అట్లూరి 5 సినిమాలను రిజెక్ట్ చేసిన హీరో… దరిద్రం అంటే ఇతనిదే?