CSK VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20026 టోర్నమెంట్ లో ( Indian Premier League 20026 Tournament) భాగంగా నిన్న కీలక మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Chennai Super Kings) మధ్య బిగ్ ఫైట్ నిర్వహించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai) జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ముంబై ఇండియన్స్ పై 103 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. బ్యాటింగ్ లో సంజు శాంసన్ సెంచరీ చేయగా.. బౌలింగ్ లో అకేల్ హోసేన్ ( Akeal Hosein) ఇరగదీశాడు. దీంతో ముంబై ఇండియన్స్ పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Mumbai Indians vs Chennai Super Kings) మధ్య మ్యాచ్ వాంఖడే వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ముంబై హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ.. స్టేడియం మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కనిపించారు. ఇక్కడ చూసిన ఎల్లో జెర్సీలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వరుసగా ముంబై ఇండియన్స్ వికెట్లు పడుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎగిరిగంతేశారు. ఇక ఓ చెన్నై సూపర్ కింగ్స్ బుడ్డోడు అయితే, తన పక్కనున్న కుర్రాడిని దారుణంగా ర్యాగింగ్ చేశాడు. నోరు ముయ్యండి రా.. అన్ని మూసుకొని దొబ్బేయండిరా అంటూ సైగలు చేస్తూ వార్నింగ్ ఇచ్చాడు. 11 పరుగులకే మూడు వికెట్లు పడ్డ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని పై విధంగా రెచ్చిపోయాడు.
దీంతో ముంబై ఇండియన్స్ అభిమాని ఏమీ చేయలేక లో లోపల కుమిలిపోయాడు. ఇంకా మరో సంఘటనలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య చెన్నై సూపర్ కింగ్స్ కు సపోర్ట్ చేస్తే, భర్త మాత్రం ముంబై ఇండియన్స్ గెలవాలని ప్రార్థనలు చేశాడు. అయితే వరుసగా ముంబై ఇండియన్స్ వికెట్లు పడుతుందో నేను నేపథ్యంలో అతని భార్య డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇందు తన భార్యకు కూడా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో మెరిసిన మరో వ్యక్తి, ఎవరికో వీడియో కాల్ చేసి… మీ ముంబై ఇండియన్స్ పనైపోయిందని అసభ్యకరమైన సైగలతో ట్రోలింగ్ చేశాడు. ఈ సంఘటన కూడా వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 207 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చదివించే క్రమంలో 104 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ముంబై.
Camera man never disappoints us 🤣😭 pic.twitter.com/uT3VEcpIZ5
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 23, 2026