Brahmamudi serial today Episode: బీరు తాగిన మత్తులో ఇందు గంతులేస్తూ..డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆ మత్తులో ఆకాశం గురించి విశ్వం గురించి కవితలు చెప్తుంది. ఈ రోజు, ఈ క్షణం ఇలాగే శాశ్వతంగా ఉండిపోవాలి అంటై ఎగిరి గంతేస్తుంటే.. రాజు బలవంతంగా ఇందును అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. నీకో దండం తల్లి ఆ డ్రింక్ తాగగానే మత్తు వచ్చి ఇంటికి వెళ్దాం అంటావు అనుకున్నాను.. కానీ ఇలా చేస్తావు అనుకోలేదు అంటాడు. దీంతో ఇందు అంత చేశానా..? అని అడుగుతుంది. రాజు వెటకారంగా అంతా ఇంతా కాదు నువ్వు చేసింది. కాసేపు భూమి కంపించినట్టు, ప్రపంచం ఊగిపోయినట్టు, విశ్వం కుదిపేసినట్టు అనిపించింది అనగానే.. ఇందు నువ్వు మరీ ఎక్కువ చేసి చెప్తున్నావు కదా…? మరీ అంత డిస్టర్బ్ చేశానా…? అని అడగ్గానే.. దాన్ని డిస్టర్బ్ చేయటం అనరమ్మా విస్పోటనం అంటారు. అనగానే..
ఇందు కోపంగా నాకేం తెలుసు…? నువ్వే కదా ఎనర్జీ డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది అన్నావు. నాకు తెలియకుండానే నాలో ఉన్న టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయి అన్నావు కదా అని ఇందు చెప్పగానే.. రాజు బుద్ది తక్కువయి అన్నానమ్మా..? బుద్ది తక్కువయి ఆ డ్రింక్ ఇచ్చాను.. మామూలు ఎనర్జీ కాదు. నిన్ను కంట్రోల్ చేయడానకి మరే ఎనర్జీ సరిపోదు అంటాడు. దీంతో ఇందు థాంక్స్.. నన్ను కిడ్నాప్ చేసి తప్పు చేశాను అనిపిస్తుందా నీకు. ఇంతకీ నువ్వు కిడ్నాపులు కాకుండా ఏం చేస్తుంటావు.. చెప్పు ఇక్కడ కూర్చోని మాట్లాడుకుందాం.. చెప్పు ఇంతకీ నువ్వు కిడ్నాపులు కాకుండా ఏం చేస్తుంటావు అని అడగ్గానే.. రాజు ఏం చేయాలో ఆలోచిస్తుంటాను అని చెప్పగానే.. అంటే ఏ పని పాటా లేకుండా తిరిగే పోకిరీవా నువ్వు అనగానే.. రాజు కొంచెం అటు ఇటుగా అలాంటిదే అనగానే.. ఇందు ఎందుకు అలా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. దీంతో రాజు పని చేసుకోవాలి అంటే పని దొరికాలి కదా అంటాడు.
దీంతో ఇందు ఎందుకు అలా నువ్వు చదువుకోలేదా..? చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లలేదా..? అని అడగ్గానే.. చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లాను. పెద్దయ్యాక కాలేజీకి వెళ్లాను. చదువుకున్నంత మాత్రాన ఉద్యోగులు దొరుకుతున్నాయా ఏంటి..? అనగానే.. ఇందు మాత్రం నువ్వైనా కాలేజీ దాకా వెళ్లావు నేను అసలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకున్నాను అని చెప్తుంది. ఇలా ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఇంతలో ఇందు తన కోసం ఒక పాట పాడమని రాజును అడుగుతుంది. రాజు నేను పాట పాడటమా..? అంటాడు. దీంతో ఇందు అయితే నేను డల్లాస్‌తోనే తేల్చుకుంటాను అని బెదిరించగానే.. రాజు భయంగా అమ్మా నేను పాట పాడతాను నువ్వు ఇక్కడే ఉండు డల్లాస్ దాకా ఎందుకు వెళ్లడం అంటూ రాజు పాట పాడటం స్టార్ట్ చేస్తాడు. పాట వింటూ ఇందు రాజు ఒడిలో నిద్రపోతుంది.
చక్రి దగ్గరకు వెళ్లిన రేఖ, భూషణ్ నువ్వు ఇస్తానన్న కోటి రూపాయలు ఇవ్వవని మాకు తెలిసిపోయింది. కనీసం యాభై లక్షలు ఇస్తావని వచ్చాము అని చెప్తారు. దీంతో చక్రి నవ్వుతూ యాభై లక్షలా..? పది సంవత్సరాలుగా నాతో చాలా డబ్బు తీసుకున్నారు.. నేను అప్పు ఇచ్చినందుకు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వడానికి నన్ను ఎన్నిసార్లు మీ చుట్టు తిప్పుకున్నారు. అసలు నేను డబ్బుల ఇస్తానంటే మీరెలా నమ్మారు..? అనగానే.. రేఖ, భూషణ్ షాక్ అవుతారు. అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వవా చక్రి అంటూ భూషణ్ అడగ్గానే.. ఇవ్వను అంటాడు చక్రి. ఇస్తానని మా నగలు తీసుకున్నావు కదా అని రేఖ అడగ్గానే.. వాటిని నా పాత బాకీ కింద జమ చేసుకున్నాను. వారం రోజుల టైం ఇస్తున్నాను నాకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు ఇవ్వాలి అంటాడు చక్రి. ఇప్పటికిప్పుడు మాకు అంత డబ్బు ఎలా దొరుకుతుంది. ఇందు వస్తేనే మాకు డబ్బులు వస్తాయి.. అంటూ రేఖ, చక్రిని కన్వీన్స్ చేయాలని చూస్తుంది. ఎంత ప్రయత్నించినా చక్రి కన్వీన్స్ కాడు. వారం రోజుల్లో మిగతా డబ్బు ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు.
తర్వాతి రోజు రోడ్డు మీద పడుకున్న రాజుకు వెంకట్ ఫోన్ చేస్తాడు. అమ్మానాన్న పెళ్లి రోజు ఇంటికి రమ్మని చెప్తాడు. రాజు చికెనే కదా వచ్చే వరకు వెయిట్ చేయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు. తర్వాత విషయం తెలుసుకున్న ఇందు పెళ్లి రోజు చికెన్‌తో సెలబ్రేట్ చేయడం ఏంటి..? చాలా గ్రాండ్‌గా చేయాలి మీ ఇంటికి వెళ్దాం పద అంటుంది. రాజు కన్వీన్స్ అవుతుంటాడు. మా వాళ్లు అడిగితే ఏం చెప్పాలి అని అడగ్గానే.. నేనొక ఈవెంట్ ప్లానర్ అని చెప్పు అంటుంది. సరే అంటూ ఇద్దరూ వెళ్లిపోతారు. రాజు ఇంటికి వెళ్లిన ఇందు అక్కడ వెంకట్, లక్ష్మీ, ఆమె భర్త ఎవరి పనుల్లో ఉంటే చూసి ఆశ్చర్యపోతుంది. రాజు, ఇందులను చూసిన లక్ష్మీ, వెంకట్ వాళ్ల నాన్న షాక్ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.