David Miller-Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Punjab Kings vs Delhi Capitals, 55th Match) మధ్య కీలక ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయం సాధించిన నేపథ్యంలో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన నేపథ్యంలో మరో ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాకు (Preity Zinta) ఢిల్లీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఫ్లయింగ్ కిస్ (David Miller flying kiss ) ఇచ్చినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీ ఆటగాడు అకిబ్ నబీ దార్ (Auqib Nabi Dar) సిక్సర్ తో మ్యాచ్ గెలిపించిన అనంతరం… డేవిడ్ మిల్లర్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ప్రీతి జింటాను ఉద్దేశించి ఈ కిస్ ఇచ్చాడని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Punjab Kings vs Delhi Capitals, 55th Match) మధ్య నిన్న ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. లీక్ దశలో మిగిలిన మ్యాచుల్లో భారీ తేడాలతో విజయం సాధిస్తే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్.. నాకౌట్ దశకు వెళ్తుంది. ఇక నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది. వాస్తవంగా ఢిల్లీ బ్యాటర్లు మాధవ్ తివారీ (Madhav Tiwari), అకిబ్ నబీ దార్ (Auqib Nabi Dar) ఇద్దరు మ్యాచ్ ఫినిష్ చేశారు. ఈ తరుణంలోనే వాళ్ళిద్దరికీ డేవిడ్ మిల్లర్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా… ప్రీతి జింటాకు ఇచ్చినట్లుగా వీడియో వైరల్ చేస్తున్నారు కొంత మంది నెటిజెన్స్. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న క్రికెట్ అభిమానులు.. అనవసరంగా డేవిడ్ మిల్లర్ ను ట్రోల్ చేస్తున్నారు.
?igsh=ZGdzbnhzend4ZG1n