E-Paper
Advertisement

Kerala: కేరళలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు స్కూల్ బస్సుల దగ్ధం

Kerala: కేరళలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు స్కూల్ బస్సుల దగ్ధం
Advertisement

Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పార్క్ చేసి ఉన్న రెండు స్కూల్ బస్సులు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల్లోనే మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సుల్లో విద్యార్థులు గానీ, డ్రైవర్లు గానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులు పార్క్ చేసిన కొద్దిసేపటికే ఒక బస్సు ఇంజిన్ నుంచి పొగలు రావడం మొదలైంది. చూస్తుండగానే మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు కూడా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేలోపే రెండు బస్సులు పూర్తిగా కాలిపోయి కేవలం అస్థిపంజరాల్లా మిగిలాయి.

Advertisement

బస్సులు తగలబడటానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, స్కూల్ నడుస్తున్న సమయంలో లేదా విద్యార్థులు ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్ , వైరింగ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాద.. బైక్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×