E-Paper
Advertisement

మరోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. ఎన్డీయే నేతలు హాజరు

మరోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం.. ఎన్డీయే నేతలు హాజరు
Advertisement

Himanta Biswa Sarma 2.0:  అస్సాంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని ఖానాపారా ప్రాంతంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

మరోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం

Advertisement

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం ఉదయం 11.40 గంటలకు గౌహతిలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్‌‌లో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య.. హిమంత బిశ్వశర్మతో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం బిశ్వశర్మతోపాటు బీజేపీ నుంచి ఇద్దరు, ఏజీపీ, బీపీఎఫ్ నుంచి ఒక్కొక్కరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు.

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అక్కడ అధికారంలోకి రావడం వరుసగా మూడోసారి. అస్సాం సీఎంగా శర్మ పగ్గాలు చేపట్టడం సెకండ్ టైమ్. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీతోపాటు చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Advertisement

ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రుల, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు

వీరితో పాటు అస్సాంలోని వైష్ణవ మఠాలకు చెందిన 15 మంది ప్రముఖ మత పెద్దలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. 126 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయేకు 102 మంది సభ్యులున్నారు. బీజేపీ 82 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలు ఏజీపీ-బీపీఎఫ్ చెరో 10 స్థానాలు దక్కించుకున్నాయి.

దీంతో రాష్ట్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిశ్వశర్మ తొలిసారిగా 2021లో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. అంతకుముందు ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా హిమంతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని హిమంత కోరిన విషయం తెల్సిందే.

ALSO READ: ఒక్క ఓటుతో గెలుపు ఎమ్మెల్యే.. హైకోర్టు కీలక ఆదేశాలు, బలపరీక్షకు టీవీకే ఎమ్మెల్యే దూరం

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×