Jasprit Bumrah: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు సిరీస్ కోల్పోయినప్పటికీ.. ఈ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే కచ్చితంగా భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు ఎవరైనా. ఈ 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో బుమ్రా నిలకడ అసాధారణం. దిగ్గజ క్రికెటర్ల నుండి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
గత కొన్నేళ్లుగా భారత పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారం అంతా తానే మోసాడు. ఈ సిరీస్ లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని సైతం గెలుచుకున్నాడు. దీంతో ఈ టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న బుమ్రా.. గతంలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.
దీంతో మూడు ఫారిన్ కంట్రీ లపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న తొలి భారతీయ క్రికెటర్ గా బుమ్రా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 2021 లో ఇంగ్లాండ్ గడ్డపై, 2024లో సౌత్ ఆఫ్రికా పై బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు బుమ్రా.
ఇక ఆస్ట్రేలియా తో జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్ లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన సేన (ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా) దేశాలలో మూడవ ఆసియా బౌలర్ గా నిలిచాడు. సేన దేశంలో బుమ్రా తొమ్మిది సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా కంటే ముందు ముత్తయ్య మురళీధరన్, వసీం అక్రమ్ ఉన్నారు. సేనా దేశాల్లో ముత్తయ్య మురళీధరన్ పదిసార్లు, వసీం అక్రమ్ 11సార్లు ఐదు వికెట్లు తీశారు.
Also Read: Virat Kohli: కోహ్లీ మాస్ ర్యాగింగ్.. గుక్కపెట్టి ఏడుస్తున్న ఆసీస్ ప్లేయర్లు !
ఓ భారత బౌలర్ విదేశాలలో ఆడిన టెస్ట్ మ్యాచ్ లలో ఇన్ని వికెట్లు తీయడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐదు మ్యాచ్ లలో మొత్తం బుమ్రా 32 వికెట్లు తీశాడు. ఈ కాలంలో అతని సగటు 13.06 గా నిలిచింది. ఈ సిరీస్ లో ఒక ఇన్నింగ్స్ లో మూడుసార్లు ఐదు వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. అలాగే రెండుసార్లు ఒక ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 లో బుమ్రా మినహా ఏ బౌలర్ కూడా 25 వికెట్ల మార్క్ ని దాటలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ ఒక్కడే 25 వికెట్లు తీసి రెండవ బౌలర్ గా నిలిచాడు.
Jasprit Bumrah becomes the first Asian player to win Player of the Series in Tests across three different SENA countries 🇮🇳🤝#JaspritBumrah #Tests #India #Sportskeeda pic.twitter.com/b26URyXZ8R
— Sportskeeda (@Sportskeeda) January 5, 2025