Kohli new bat: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 ని భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో ముగించాడు. ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏకంగా 8సార్లు ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు అవుట్ కావడం గమనార్హం. గతంలో ఈ ఆఫ్ సైడ్ బంతులను అద్భుతంగా ఆడే కోహ్లీ.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్ ని కోల్పోతుండడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.
Also Read: Yuzvendra Chahal: భార్యతో విడాకులు.. దేవదాసులా మారిన టీమిండియా క్రికెటర్ !
ఈ సిరీస్ లో కోహ్లీ మొత్తం 9 ఇన్నింగ్స్ లు ఆడితే.. ఇందులో 8 సార్లు ఇలాగే అవుట్ అయ్యాడు. కేవలం ఒక్కసారి సెంచరీతో చెలరేగి నాట్ అవుట్ గా నిలిచాడు. పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ లో సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. పింక్ బాల్ టెస్ట్ లో 7, 11 పరుగులు. బ్రిస్ బెన్ లో మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులతో కాస్త రాణించినట్టే కనిపించి మళ్లీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతికే వెనుదిరిగాడు.
రెండవ ఇన్నింగ్స్ లో ఐదు పరుగులే చేసి మళ్లీ అదే కథను రిపీట్ చేశాడు. ఇక సిడ్నీ టెస్ట్ లోని మొదటి ఇన్నింగ్స్ లో 17, రెండవ ఇన్నింగ్స్ లో ఆరు పరుగులే చేశాడు. విరాట్ వీక్నెస్ ని కనిపెట్టిన ఆసీస్ బౌలర్లు ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులతోనే కోహ్లీ వికెట్ ని పడగొడుతున్నారు. ఇక ఇప్పటికే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అతడు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అద్భుతమైన రికార్డ్ ఉన్న కోహ్లీ.. ఈసారి మాత్రం ఆ మార్క్ ని చూపించలేకపోయాడు. ఇలా తన బ్యాట్ తో విఫలం అవుతున్న విరాట్ కోహ్లీకి ఆయన అభిమాని ఓ అద్భుతమైన గిఫ్ట్ ని తయారు చేశాడు. విరాట్ కోహ్లీ కోసం ఓ బ్యాట్ ని తయారు చేశాడు. ఈ బ్యాట్ కి సంబంధించిన ఫన్నీ వీడియోని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
Also Read: Jasprit Bumrah: SENA దేశాలపై చరిత్ర సృష్టించిన బుమ్రా..ఆసీయాలోనే తొలి ప్లేయర్ గా !
ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను కోహ్లీ ఆడుతున్న సమయంలో ఆ బంతులు బ్యాట్ ఎడ్జ్ ని తగిలి కీపర్ లేదా స్లిప్ లో ఉన్న ఫీల్డర్ చేతులలోకి వెళుతుంటాయి. ఇలా బ్యాట్ ఎడ్జ్ కి తగిలి వెనకకి వెళ్లకుండా ఉండేందుకు అతడు ఆ బ్యాట్ ఎడ్జ్ సైజ్ ని పెంచి ఈ బ్యాట్ ని తయారు చేసినట్లుగా వీడియోలో చూపించాడు. ఈ బ్యాట్ వాడితే ఇక విరాట్ కోహ్లీని ఔట్ చేయడం సాధ్యం కాదని అతడు ఫన్నీగా చెబుతూ పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">