Spain Damage World Cup Trophy: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ (FIFA World Cup 2026 tournament) విజేతగా స్పెయిన్ జట్టు ( Spain) నిలిచిన సంగతి తెలిసిందే. మొన్న సోమవారం రోజున అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ (Argentina vs. Spain ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన స్పెయిన్… అర్జెంటీనాను ఓడించింది. ఈ క్రమంలో రెండోసారి ఛాంపియన్ జట్టుగా నిలిచింది స్పెయిన్. దీంతో స్పెయిన్ దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే, ఈ సంతోషం మూడు రోజులు కూడా లేకుండా చేశారు స్పెయిన్ ఆటగాళ్లు. దాదాపు 200 కోట్ల విలువ ఉన్న ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని రెండు ముక్కలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అర్జెంటీనాపై అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న స్పెయిన్.. రెండోసారి ఛాంపియన్ అయింది. ఈ క్రమంలో ట్రోఫీ అందుకున్న స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ట్రోఫీని అమెరికా నుంచి స్పెయిన్ కు తీసుకువెళ్లే సమయంలో పెను ప్రమాదం జరిగినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ ( Ferran Torres) అజాగ్రత్తగా వ్యవహరించాడని, ఈ క్రమంలో ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ముక్కలైనట్లు చెబుతున్నారు. ఓ సూటు కేసులో.. దాదాపు 200 కోట్ల విలువ ఉన్న ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ భద్రపరిచారు స్పెయిన్ ఆటగాళ్లు. ఆ సూట్ కేసును స్పెయిన్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ ( Ferran Torres) పట్టుకొని ట్రావెల్ చేశాడు.
అయితే కాస్త నిర్లక్ష్యం వహించడంతో… సూట్ కేసు కిందపడి… ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ రెండు ముక్కలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇది చూసిన ఫిఫా అభిమానులు షాక్ అవుతున్నారు. మొన్న కూరగాయల లాగా ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని కవర్ లో పెట్టుకున్నారని… ఇప్పుడు సూట్ కేసులో పెట్టుకొని.. కింద పడేసారని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఆ నష్టం ఎవరు భరించాలంటూ నిలదీస్తున్నారు. అయితే కింద పడ్డ ఆ సూట్ కేసులో ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ లేదని మరికొంతమంది చెబుతున్నారు. ఏదో వస్తువులు కింద పడ్డాయి తప్ప.. వరల్డ్ కప్ పడలేదని పేర్కొంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ బరువు 6.175 కిలో గ్రాములు ఉంటుంది. ఇందులో 4.93 కిలోల నుంచి 5 కేజీల వరకు స్వచ్ఛమైన 18 క్యారెట్ బంగారం కలుపుతారు. ఇటాలియన్ శిల్పి సిల్వియో 1971లో దీన్ని డిజైన్ చేశారు. ఈ ట్రోఫీ విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==