Babar Azam-Ellyse Perry: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాంకు ( Babar Azam ) బంపర్ ఆఫర్ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్న బాబర్ ఆజాం జీవితంలోకి ఇంగ్లీష్ పిల్ల రాబోతుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ ( Ellyse Perry ), బాబర్ ఆజాం ప్రేమలో పడిపోయిందట. ఈ నేపథ్యంలోనే బిగ్ బ్యాష్ లీగ్ ఆడుతున్న బాబర్ ఆజాంకు ఎల్లీస్ పెర్రీ ప్రపోజ్ చేసినట్లు వీడియోతో పాటు ఫోటో కూడా బయటకు వచ్చింది. తన మోకాళ్లపై కూర్చొని మరి బాబర్ ఆజాంకు ఎల్లీస్ పెర్రీ ప్రపోజ్ చేసినట్లు ఇందులో ఉంది. అయితే ఎల్లీస్ పెర్రీ దిగివచ్చి ప్రపోజ్ చేసినప్పటికీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబార్ రిజెక్ట్ చేశాడట. ఈ మేరకు బాబర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.
బిగ్ బాష్ లీగ్ లో ఈసారి అడుగుపెట్టిన బాబర్ అజాం, అనుకున్నంత రీతిలో ఆకట్టుకోవడం లేదు. ఎప్పుటిలాగానే పాత చింతకాయ పచ్చడి లాగా తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఆయన ఆట తీరు పక్కకు పడితే, ఇంగ్లీష్ పిల్ల బెంగళూరు జట్టుకు ఆడిన ఎల్లీస్ పెర్రీ, బాబర్ ఆజాంకు ప్రపోజ్ చేసినట్లు ఫోటోలు, వీడియో బయటకు వచ్చాయి. దీంతో ఇది నిజం అనుకోని అందరూ రచ్చ రచ్చ చేస్తున్నారు. వాస్తావానికి ఇది ఏఐ ఫోటో అని తెలుస్తోంది. ఆ ఫోటో ద్వారా వీడియో క్రియేట్ చేసి బాబర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో, ఫోటోలు చూసిన వాళ్లు ఎవరు అది నిజమని నమ్మడం లేదు. బాబార్ ఆజాం ముఖానికి అంత మంచి పిల్ల దొరకడం కష్టమే అని కౌంటర్ ఇస్తున్నారు.
BBL 15వ సీజన్ లో అడుగు పెట్టాడు బాబర్ ఆజాం. ఈ నేపథ్యంలోనే సిడ్నీ సిక్సర్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. అయితే ఈ టోర్నమెంట్ లో పెద్ద ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లు ఆడాడు బాబర్ ఆజాం. ఇందులో 145 పరుగులు మాత్రమే సాధించాడు. జనవరి ఒకటో తేదీన మెల్ బోర్న్ జట్టుపైన 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఏ ఒక్క మ్యాచ్ లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు.
ఇక అటు ఎల్లీస్ పెర్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆమె ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. 1990లో జన్మించిన ఈమె ప్రస్తుతం వయసు 35 సంవత్సరాలు. ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న ఎల్లీస్ పెర్రీ, ఉమెన్స్ ప్రీమియర్ టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి WpL 2026 టోర్నమెంట్ ఆడడం లేదు ఎల్లీస్ పెర్రీ.
Big Breaking ⚠️
Ellyse Perry Has Propose To Babar Azam
And Babar Azam Also Accepted Proposal Of Perry
Many Many Congratulations To Them ❤️❤️
Babar ❤️ Perry#BBL15 #BabarAzam𓃵 #perry #sydneysixers pic.twitter.com/7UPjzIa6Bv
— Nikku चौधरी (@jatniku_rj18) January 8, 2026
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==