England Arrive In Pakistan: వన్డే సిరీస్ నేపథ్యంలో దాదాపు 21 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ లో ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ అడుగు పెట్టింది. లండన్ లో విమానం ఎక్కిన ఇంగ్లాండ్ ప్లేయర్లు, ఇస్లామాబాద్ లో దిగారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ లో ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. పాకిస్తాన్ సంప్రాదాయ టోపీలకు కూడా ఇంగ్లీష్ క్రికెటర్లకు పెట్టి, సత్కారించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెటర్ల ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ తరుణంలోనే ఉగ్రవాదుల టెన్షన్ ఉన్నప్పటికీ, పాకిస్తాన్ లో ఇంగ్లాండ్ క్రికెటర్లు అడుగు పెట్టారని నెటిజెన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో ఇంగ్లాండ్ పర్యటించిందనే న్యూస్ ఫేక్ అని నివేదికలు చెబుతున్నాయి. 2005లో పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అడింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్క వన్డే సిరీస్ ఆడలేదు. ఇంగ్లాండ్ పర్యటనకు పాక్ వెళ్లింది తప్పితే, ఇక్కడికి వన్డేల కోసం ఇంగ్లాండ్ రాలేదు. కానీ 2022లో పాకిస్తాన్ లో పర్యటించిన ఇంగ్లాండ్, టెస్టులతో పాటు టీ20లు ఆడింది. 2024లో టెస్ట్ సిరీస్ ఆడింది. అంటే ఈ లెక్కన 21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై వన్డే సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వస్తోందన్న మాట. కానీ 21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఇంగ్లాండ్ పర్యటించబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
ఇస్లామాబాద్ లో పర్యటించిన ఇంగ్లాండ్ ప్లేయర్లకు టోపీలు పాకిస్తాన్ పెట్టింది. ఆ టోపీలను సింధీ టోపీలు అని పిలుస్తారు. పాకిస్తాన్ గడ్డపై అతిథులు ఎవరైనా వస్తే, ఈ టోపీలు పెట్టే సంస్కృతి ఆనవాయితీగా వస్తోంది. ఈ తరుణంలోనే ఇంగ్లాండ్ ప్లేయర్లను కూడా ఆ టోపీలతో సత్కరించారు.
ఇంగ్లాండ్, శ్రీలంక, పాక్ జట్ల మధ్య వన్డే ఫార్మాట్ లో ట్రై సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 18వ తేదీ అంటే ఆదివారం నుంచి షురూ కానుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ట్రై సిరీస్ కు రావాల్పిండితో పాటు లాహోర్ లోని గడాఫీ స్టేడియాలు వేదికలు కానున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్ లు కాబట్టి మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ లు షురూ కానున్నాయి. ఈ ట్రై సిరీస్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిచన జట్లు ఫైనల్స్ కు చేరతాయి. ఈ తరుణంలోనే అక్టోబర్ 31వ తేదీన గడాఫీ స్టేడియం వేదికగా ఫైనల్స్ ఉంటుంది.