Jordan Cox On Pakistani security: పాకిస్తాన్ గడ్డపై ఆదివారం వన్డే ట్రై సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ సిరీస్ జరుగుతోంది. అయితే ఈ ట్రై సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నట్టు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పర్యటనపై ఇంగ్లాండ్ ఆటగాడు, ఐపీఎల్ లో బెంగుళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జోర్డాన్ కాక్స్ (Jordan Cox) వివాదాస్పద పోస్ట్ పెట్టాడు.
పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టిన నుంచి నిద్ర లేకుండా పోయిందని జోర్డాన్ కాక్స్ వ్యాఖ్యానించాడు. ఇస్లామాబాద్ లో కంటినిండా నిద్రపోలేకపోతున్నామంటూ బాంబ్ పేల్చాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ? తెలియని పరిస్థితిలో ఉన్నాయంటూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వెళ్తున్న వాహనం ఫోటోను షేర్ చేశాడు. ఇక్కడి ఆర్మీ అధికారులు కూడా ఉగ్రవాదులు లాగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవడు అధికారో ? ఎవడు ఉగ్రవాదో ? తెలియడం లేదంటూ గందరగోళ పరిస్థితిని వివరించే వివరించే ప్రయత్నం చేశాడు. దీంతో జోర్డాన్ కాక్స్
చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ రెండు రోజుల కిందట ఇస్లామాబాద్ గడ్డపై దిగింది. ఈ క్రమంలో అక్కడే ఓ ప్రముఖ హోటల్ లో ఇంగ్లాండ్ క్రికెటర్లు బస చేస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులు ఎప్పుడు దాడి చేస్తారో ? తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంగ్లాండ్ క్రికెటర్లు బస చేస్తున్న హోటల్ దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పాకిస్తాన్. నిన్న ఉదయం ఇంగ్లాండు క్రికెటర్లు బసచేస్తున్న హోటల్ పక్కన పేలుడు శబ్దాలు వినబడ్డాయి.
దీంతో ఉగ్రవాదులే దాడి చేశారని ఇంగ్లండ్ క్రికెటర్లు నరకం అనుభవించారు. ఇలాంటి క్రమంలో అలర్ట్ అయిన పాకిస్తాన్ అధికారులు…దీనిపై విచారణ చేసి గ్యాస్ సిలిండర్ పేలిందని గుర్తించారు. ఎలాంటి ఉగ్రదాడి జరగలేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్లు గజ గజ వణికి పోతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ వన్డే సిరీస్ తొలి మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య నిన్న రావల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ 37 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది.