Fakhar Zaman Fitness Controversy: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia tour of Pakistan 2026) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతోంది. 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే మొదటి వన్డేలో పాకిస్తాన్ విక్టరీ నమోదు చేసుకుంది. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య రెండవ వన్డే కూడా గడాఫీ స్టేడియం వేదికగా జరగనుంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఫఖార్ జమాన్ ఫిట్నెస్ వివాదంగా మారింది. గాయం పేరుతో వన్డే సిరీస్ కు దూరమైన ఫఖార్ జమాన్, ఇప్పుడు పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్ ఫైనల్స్ లో (Pakistan National T20 Cup Finals) ఏకంగా ఓ జట్టు కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఫఖార్ జమాన్ (Fakhar Zaman Fitness Controversy) మోసం చేశాడని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. మొహ్సిన్ నఖ్వీని (Mohsin Naqvi
) దద్దమ్మను చేసి.. ఇప్పుడు మ్యాచ్ ఆడేందుకు ఫఖార్ జమాన్ సిద్ధమయ్యాడని అంటున్నారు.
ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మే 30వ తేదీన వన్డే సిరీస్ ప్రారంభమైంది. అంత కంటే ముందు వారం రోజుల కిందట పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రకటించింది PCB. అయితే ఈ క్రమంలో తనకు గాయమైందని ఫఖార్ జమాన్ నాటకాలు ఆడాడు. గాయం కారణంగా తాను ఆడలేనని… పాకిస్తాన్ క్రికెట్ బోర్డును మోసం చేశాడు. దీంతో అతగాడిని పక్కకు పెట్టి మరీ, మిగతా ప్లేయర్లను సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కూడా ప్రారంభమైంది. అయితే ఇలాంటి నేపథ్యంలో తన ఫిట్నెస్ విషయంలో ట్విస్ట్ ఇచ్చాడు ఫఖార్ జమాన్. జూన్ ఏడవ తేదీన లాహోర్ గడాఫీ స్టేడియం వేదికగా పాకిస్తాన్ నేషనల్ టి20 ఫైనల్ జరగనుంది. అయితే ఇందులో కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు ఫఖార్ జమాన్. అబోటాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ నేషనల్ టీ20 కప్ ఫైనల్ వాస్తవంగా మార్చి నెలలో జరగాలి. కానీ వర్షం కారణంగా ఆ ఫైనల్ మ్యాచ్ ను జూన్ 7వ తేదీకి వాయిదా పడేశారు. ఈ క్రమంలో జూన్ 7వ తేదీన ఫైనల్స్ లో భాగంగా అబోటాబాద్ వర్సెస్ కరాచీ వైట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అబోటాబాద్ జట్టుకు కెప్టెన్ గా తిరుగుతున్నాడు ఫఖార్ జమాన్. అయితే ఫిట్నెస్ గా లేనని చెప్పిన ఫఖార్ జమాన్… ఇప్పుడు ఫైనల్ ఎలా ఆడతాడు ? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇలాంటి వాళ్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ వన్డే సిరీస్ వదిలేసి.. గల్లీ క్రికెట్ ఎందుకు ఆడుతున్నాడని నిలదీస్తున్నారు. ఇంత జరుగుతున్న మొహ్సిన్ నఖ్వీ ఏం పీకుతున్నాడని ఫైర్ అవుతున్నారు.
🚨 FAKHAR ZAMAN FITNESS CONTROVERSY 🚨
– Fakhar Zaman was deemed unfit for Pakistan’s ODI plans due to injury.
– Now, he is set to captain Abbottabad in the National T20 Cup Final on June 7.
– If he is fit enough to lead a team in a major domestic final, why wasn’t he… pic.twitter.com/t44mbAXbj2
— Rayham. (@RayhamUnplugged) June 2, 2026