Ravichandran Ashwin: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) తుది దశకు వచ్చేసింది. నిన్న క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో భాగంగా గుజరాతి టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్, ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఇంటి దారి పట్టగా, గుజరాత్ టైటాన్స్ మాత్రం ఫైనల్స్ కు చేరుకుంది. అయితే నిన్న న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavansh) మరోసారి సెంచరీని చేజార్చుకున్నాడు. మొన్న ఎలిమినేటర్ సందర్భంగా కూడా హైదరాబాద్ జట్టు పైన 97 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్న వైభవ్.. నిన్న 96 పరుగులకు ఔట్ అయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఎలిమినేటర్ అలాగే క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ సందర్భంగా వరుసగా రెండు సెంచరీలు మిస్ చేసుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ.. రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ రెండు మ్యాచ్లకు కూడా రవిచంద్రన్ అశ్విన్ కామెంట్రీ చేశాడు. హైదరాబాద్ తో మ్యాచ్ జరిగినప్పుడు 97 పరుగుల వద్ద వైభవ్ ఔట్ (vaibhav sooryavanshi century miss) కాగానే, అయ్యో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అశ్విన్. కామెంట్రీ పక్కన పెట్టి.. నూరెళ్లబెట్టి, ఎమోషనల్ అయ్యాడు.
ఇక నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా వైభవ్ సెంచరీ మిస్ కాగానే.. కన్నీళ్లు పెట్టుకున్నాడు అశ్విన్. అయ్యో బుడ్డోడు, రెండుసార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు. అటు అశ్విన్ తో పాటు నిన్న కామెంట్రీ చేసిన హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ కూడా తలలు పట్టుకున్నారు. బుడ్డోడు ఆవేశపడ్డాడే… కొంచెం మెల్లగా ఆడి ఉంటే సెంచరీ చేసుకునేవాడని బాధపడ్డారు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin), ఇతర మాజీ క్రికెటర్ల ఎమోషనల్ వీడియో వైరల్ గా మారింది.
ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సింగిల్స్ కోసం ప్రయత్నించి ఉంటే రెండు సెంచరీలు ఫినిష్ చేసుకునేవాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… రాజస్థాన్ రాయల్స్ జట్టు పైన గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ కు దూసుకు వెళ్లింది. ఇక ఆదివారం రోజున అంటే రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ ఉంటుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==