E-Paper
Advertisement

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!
Advertisement

Hyderabad Metro Viral Video: హైదరాబాద్ మహా నగరంలోని ప్రధాన రవాణ వ్యవస్థల్లో మెట్రో ఒకటి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను.. ట్రాఫిక్ సమస్యల నుంచి రక్షిస్తూ అత్యంత వేగంగా గమ్యస్థానానికి మెట్రో చేరుస్తోంది. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు సొంత వాహనాలు ఉన్నప్పటికీ మెట్రోనే ఆశ్రయిస్తుంటారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది ప్రతీ ఒక్కరూ మెట్రోలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి మెట్రోలో తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటన.. నెట్టింట వైరల్ గా మారింది. కొందరిలో కనీస సామాజిక స్పృహ ఏ స్థాయిలో లోపిస్తుందో ఈ ఘటన అద్దం పడుతోంది.

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ మెట్రోలో జూన్ 1వ తేదీ ఉదయం.. ఆఫీసు వేళల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. సీట్లో కూర్చుని తన కాలును ఏకంగా పక్కనే ఉన్న సీటుపై పెట్టి అనాగరికంగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులు కూర్చునేందుకు ప్రయత్నించినా.. వారికి చోటు ఇవ్వలేదు. ఇది తప్పని తోటి ప్రయాణికులు వారించగా.. వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

నెటిజన్లు తీవ్ర ఆగ్రహం

ఈ దృశ్యాలను మెట్రోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తన మెుబైల్ లో బంధించి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారడటంతో యువకుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘చదువు ఉంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇలాంటి వారి వల్లే పబ్లిక్ ప్రాపర్టీ పాడవుతోంది, వీరికి భారీగా జరిమానాలు విధించాలి’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రో అధికారులను సైతం ట్యాగ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: సుర్రుమనే ఎండలకు.. షావోమీ ‘కూల్’ పంచ్.. జస్ట్ 15 సెకన్లలో చిల్లుమనే చల్లదనం!

కఠిన చర్యలకు డిమాండ్

రైళ్లు, బస్సులతో పాటు మెట్రోలు సైతం ప్రజల ఆస్తి కిందకే వస్తాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే మెట్రోలో మర్యాదగా నడుచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత పలువురు సూచిస్తున్నారు. తోటి ప్రయాణికుల పట్ల వినయ, విధేయలతో ప్రవర్తించాలని హితవు పలుకుతున్నారు. టికెట్ తీసుకున్నాం కదా అని ఇష్టారీతిన మెట్రోలో వ్యవహరిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేందని లేదని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ లో మెట్రోలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యువకుడిపై మెట్రో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read: క్రోమా నమ్మశక్యం కాని ఆఫర్.. సగం ధరకే సరికొత్త ‘ఐఫోన్ 17’.. చార్జర్ కూడా ఫ్రీ!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×