Ananya Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఫైనల్స్ రేపు జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య ఈ మ్యాచ్ ఉండనుంది. రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ షురూ అవుతుంది. అయితే ఇలాంటి క్రమంలో ఐపీఎల్ 2026 ఫైనల్స్ పై సంచలన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ బెంగళూరు మధ్య ఫైనల్స్ జరగాలని ముందే ఫిక్స్ అయిందని, సంచలన ఆరోపణలు వస్తున్నాయి. బెంగళూరు కొత్త ఓనర్ అనన్య బిర్లా (Ananya Birla) చేసిన పాత పోస్టు వైరల్ చేస్తూ, ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో ( Indian Premier League 2026 Tournament) గుజరాత్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడతాయని అనన్య బిర్లా ముందే ఊహించినట్లు తాజాగా ఓ పోస్టు వైరల్ గా మారింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభ దశలో అనన్య బిర్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఫైనల్స్ లోకి రావాలన్నది తన డ్రీమ్ అని ఆమె వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు. అయితే ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు అదే రెండు జట్లు ఫైనల్స్ కు వచ్చాయి. దీంతో అనన్య బిర్లా చెప్పింది జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై మరి కొంత మంది విష ప్రచారం చేస్తున్నారు. ఫైనల్స్ ముందే ఫిక్స్ అయిందని… అనన్య బిర్లా ఫ్యామిలీకి సంబంధించిన రెండు జట్లు ఫైనల్స్ కు వచ్చినట్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఫిక్సింగ్ అని ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ లో జరిగే ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ అని ఫ్రూఫ్స్‌తో ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్ నకు గుజరాత్ టైటాన్స్ కు కూడా సంబంధం ఉంది. ఈ సీజన్ నుంచే ఆదిత్య బిర్లా గ్రూప్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. గుజరాత్ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యవహరిస్తోంది. అందుకే గుజరాత్ టైటాన్స్ జెర్సీ పైన బిర్లా ఎస్టేట్స్ అని రాసి ఉంటుంది. డ్రీమ్ 11 పైన బ్యాన్ విధించిన నేపథ్యంలో ఆస్థానాన్ని బిర్లా ఎస్టేట్స్ భర్తీ చేసుకుంది. అందుకే ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందు గుజరాత్ టైటాన్స్ జెర్సీని అనన్య బిర్లా ఆధ్వర్యంలోనే లాంచ్ చేశారు. ఇక ఈ సంవత్సరమే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసింది. అంటే ఫైనల్స్ లో ఎవరు గెలిచినా ఆదిత్య బిర్లా గ్రూప్ నకు అడ్వాంటేజ్ అవుతుంది.