E-Paper
Advertisement

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !
Advertisement

Fox Cricket On Vaibhav Age:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 700కు పైగా పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. అంతేకాదు క్రిస్ గేల్ ( Chris Gayle) హైయెస్ట్ సిక్సర్ల రికార్డును కూడా ఈ ఏడాది బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో దాదాపు 50 లక్షల వరకు ఐపీఎల్ ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు వైభవ్. ఇటీవల 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైభవ్… అతి త్వరలోనే టీమ్ ఇండియా జట్టులోకి కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఐపిఎల్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ పైన ప్రశంసల కురుస్తున్న నేపథ్యంలో… ఆస్ట్రేలియా మీడియా మాత్రం విషం కక్కింది. వైభవ్ సూర్యవంశీ పెద్ద మోసగాడు అంటూ ప్రత్యేక కథనం ప్రచురించింది. వాడి వయస్సు (Vaibhav Sooryavanshi AGE ) విషయంలో నాటకాలు ఆడుతున్నాడని బాంబు పేల్చింది.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

వైభ‌వ్ ప‌చ్చిమోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైన ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫాక్స్ క్రికెట్ (Fox Cricket) వివాదాస్పద కథనం ప్రచురించింది. వైభవ్ సూర్య వంశీ పచ్చి మోసగాడు అంటూ పేర్కొంది. వాడి వయసు 15 సంవత్సరాలు కాదని.. 19 సంవత్సరాలకు పైగా ఉంటాడని వెల్లడించింది. కానీ వయసు విషయంలో నాటకాలు ఆడి… 15 ఏళ్ల కుర్రాడిలా చెప్పుకు తిరుగుతున్నాడని బాంబు పేల్చింది. దీనిపై విచారణ చేస్తే అసలు విషయం బయట పడుతుందని వెల్లడించింది ఫాక్స్ క్రికెట్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫాక్స్ క్రికెట్ ప్రచురించిన కథనం వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇండియన్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ కెరీర్ ను నాశనం చేసేందుకు ఆస్ట్రేలియా కుట్రలు చేస్తోందని.. తమ దగ్గర అలాంటి ప్లేయర్ లేడని కుళ్ళుకుంటోందని కౌంటర్ ఇస్తున్నారు. అందుకే వైభవ్ సూర్య వంశీ పై విషప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైభ‌వ్ పై పాకిస్తాన్ కూడా విమ‌ర్శ‌లు

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైన అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీకి 15 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు ఉంటాయని ఆరోపిస్తున్నారు. అతనికి వెంటనే బోన్ టెస్టు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్, షాహిద్ అఫ్రిది, ఇంజమాం లాంటి మాజీ దిగ్గజ క్రికెటర్లు ఇప్పటికే ఈ అంశంపై స్పందించి… ఆరోపణలు చేశారు.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×