E-Paper
Advertisement

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ క్యాప్ దొంగ‌త‌నం.. టీమిండియా ఆలౌట్.. స్కోర్ ఎంత అంటే

Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ క్యాప్ దొంగ‌త‌నం.. టీమిండియా ఆలౌట్.. స్కోర్ ఎంత అంటే
Mohammed Siraj: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa, 2nd Test) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదు. బౌలింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయిన టీమ్ ఇండియా, ఇప్పుడు బ్యాటింగ్ లో కూడా చేతులెత్తేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) చేసిన పని వైరల్ గా మారింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తన రౌండ్ క్యాప్ ను గ్రౌండ్ లో తిరిగే కెమెరాకు ( Mohammed Siraj Cap )తగిలించాడు సిరాజ్‌. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ తెగ న‌వ్వుకుంటున్నారు.

మహమ్మద్ సిరాజ్ క్యాప్ దొంగ‌త‌నం

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుల్లో మహమ్మద్ సిరాజ్ చేసిన పని అందరికీ నవ్వు తెప్పించింది. నిన్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో తన రౌండ్ క్యాప్ ను పెట్టుకోకుండా, గ్రౌండ్ లో తిరిగే కెమెరాకు తగిలించేశాడు మహమ్మద్ సిరాజ్. ఓవర్ పూర్తయ్యే వరకు ఆ కెమెరా తోనే ఉంది క్యాప్. అనంతరం మహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్ చేసేందుకు వెళ్లే క్రమంలో తిరిగి అతనికి కెమెరామెన్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఇలాంటి పని ఎవరు చేయలేదు. తన క్యాప్ ను కెమెరాకు ఇచ్చి మహమ్మద్ సిరాజ్ అందరిని నవ్వించాడు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa, 2nd Test) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ 30 ఓవ‌ర్లు సంధించాడు.

ఇందులో 5 మెడీన్లు చేయ‌గా, 106 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అదే స‌మ‌యంలో 2 కీల‌క వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ ( Mohammed Siraj). ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టిన మ‌హమ్మ‌ద్ సిరాజ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా మ‌హమ్మ‌ద్ సిరాజ్ రికార్డు లోకి ఎక్కాడు. మొన్నటి వరకు ముజారబానీ 42 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసి మహమ్మద్ సిరాజ్ 43 వికెట్లతో మొదటి స్థానానికి వచ్చాడు. వీళ్ళిద్దరి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్ కు 39 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక అటు వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్స్ షిప్ 2025-2027 టోర్న‌మెంట్ లో కూడా సిరాజ్ ఎక్కువ వికెట్లు ప‌డగొట్టిన ప్లేయ‌ర్ గా రికార్డులోకి ఎక్కాడు.

201 పరుగులకు కుప్పకూలిన టీమిండియా

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా అత్యంత దారుణంగా విఫలమైంది. ఈ మొదటి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా కంటే 288 పరుగుల వెనుకంజలో నిలిచింది ఇండియా. వాస్తవంగా టీమిండియా ఫాలోవన్ ఆడాల్సి ఉంది. కానీ దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×