Furqan Bhatti On Gill : టీమిండియా అలాగే పాకిస్తాన్ టి20 జట్లపై ప్రముఖ జర్నలిస్టు, యుట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి ( Furqan Bhatti ) సంచలన వ్యాఖ్యలు చేశారు. టి20 జట్టును తయారు చేయడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి చాలా బెటర్ అన్నారు. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 సందర్భంగా శుభ్మన్ గిల్ లాంటి పెద్ద ఆటగాడిని పక్కకు పెట్టి ఇషాన్ కిషన్ ను తెరపైకి తీసుకు వచ్చినట్టు గుర్తు చేశారు. గిల్ కు అవమానం జరిగినా, టి20 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యమే ముఖ్యమని బీసీసీఐ ముందుకు వెళ్లిందన్నారు. టి20లకు గిల్ కంటే ఇషాన్ కిషన్ మెరుగైన ఆటగాడని భావించి.. బీసీసీఐ అలాంటి పెద్ద నిర్ణయాన్ని తీసుకుందని వెల్లడించారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఇలాంటి ధైర్య సాహసాలు చేయలేక విఫలమవుతోందని మండిపడ్డారు. దీంతో టీమిండియాను ప్రముఖ జర్నలిస్టు, యుట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి ( Furqan Bhatti ) చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వన్డేలతో పాటు టెస్టులకు కెప్టెన్ గా ఉన్న గిల్ ను టీ20లలో ఏ మాత్రం బీసీసీఐ పట్టించుకోవడంలేదని ఫుర్ఖాన్ భట్టి ( Furqan Bhatti ) హాట్ కామెంట్స్ చేశారు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ కు ప్రాధాన్యత ఇచ్చి టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా గిల్ ను పక్కకు పెట్టారన్నారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించిన తోపు ఆటగాడు గిల్ ను కాదని ఇషాన్ కిషన్ ను ఎలివేట్ చేయడం నిజంగా అవమానకరమన్నారు. గిల్ లాంటి గొప్ప ప్లేయర్ ను బీసీసీఐ అవమానించి ఇషాన్ కిషన్ ను తీసుకుపోవడం దారుణమని ఫైర్ అయ్యారు.
కానీ టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీసీఐ అలా ముందుకు వెళ్లిందని క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం టీమిండియా కు మంచే చేసింది తప్ప ఎక్కడా నెగిటివ్ కాలేదని వివరించారు. ఇప్పుడు టీమిండియా జట్టులో ఇషాన్ కిషన్ కీలక ఆటగాడిగా మారాడని వెల్లడించారు. ఇది బీసీసీఐ తీసుకున్న చాలా కఠినమైన నిర్ణయం అని తెలిపారు. ఇలాంటి విషయాలలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం వెనుకబడిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇలాంటి సాహసాలు చేసి ఉంటే టాలెంట్ ఉన్న క్రికెటర్లు జట్టులోకి ఇప్పటికే చాలామంది వచ్చేవారు అన్నారు. హసన్ నవాజ్ లాంటి ఎంతో మంది తోపు క్రికెటర్లు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ వెలుగులోకి రాలేకపోతున్నారన్నారు. పాత వాళ్లనే కొనసాగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధైర్య సాహసాలు చేయలేకపోతుందని వ్యాఖ్యానించారు.