E-Paper
Advertisement

Gautam Gambhir: ఐసీయూలో కెప్టెన్ గిల్‌.. ప‌ట్టించుకోని బీసీసీఐ.. గంభీర్ తిరుగుబాటు ?

Gautam Gambhir: ఐసీయూలో కెప్టెన్ గిల్‌.. ప‌ట్టించుకోని బీసీసీఐ.. గంభీర్ తిరుగుబాటు ?
Advertisement

Gautam Gambhir: టీమిండియాకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ కొలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ గిల్ బ్యాటింగ్ చేస్తూ.. మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన గిల్.. గాయం కారణంగా మైదానం నుండి వెళ్లిపోయాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగుల వద్ద ముగించింది.

Also Read: IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేక‌ర్‌.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే

గిల్ గాయం తీవ్రతరం:

Advertisement

కెప్టెన్ గిల్ గాయం తీవ్రమైనట్లు సమాచారం. దీంతో అతడు మొదటి టెస్ట్ లో మిగిలిన ఆటకు మాత్రమే కాకుండా.. రెండవ టెస్ట్ కి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గాయం తీవ్రం కావడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ ని కలకత్తాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచినట్లు తెలుస్తోంది. మెడకి సర్వైకల్ కాలర్ తో స్ట్రక్చర్ పై తీసుకువెళ్లడంతో ఆయనకు సివియర్ ఇంజూరీ అయ్యిందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ విషయం తెలిసిన టీమిండియా క్రీడాభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికే స్పందించిన విషయం తెలిసిందే. గిల్ మెడ పట్టేయడంతో ఆసుపత్రికి తరలించామని.. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తుందని తెలిపింది. అయితే నిద్రలేమి కారణంగానే గిల్ మెడ కండరాలు పట్టేశాయని.. అతడు త్వరగానే రికవరీ అవుతాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మొర్కెల్ తెలిపారు.

గిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్:

గిల్ కోసం ప్రత్యేకంగా డాక్టర్స్ ప్యానెల్ ఏర్పాటు అయ్యింది. క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, న్యూరో సర్జన్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అతడిని పరిశీలిస్తున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్ కి ప్రస్తుతం పెద్దగా సమస్య లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మేరకు కేర్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వైద్య పరీక్షలు చేసిన తర్వాతే అతడు మళ్ళీ మైదానంలోకి దిగుతాడా..? లేదా..? అన్నది తేలుతుందని బిసిసిఐ తెలిపింది. అయితే గిల్ గాయం విషయాన్ని బీసీసీఐ సీరియస్ గా తీస కోవడం లేదని.. ఈ విషయంలో బీసీసీఐపై కోచ్ గౌతమ్ గంభీర్ సిరీస్ గా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Also Read: Shoaib Malik: నాలుగో పెళ్లి చేసుకుంటున్న పాకిస్తాన్ క్రికెటర్.. ముగ్గురికి విడాకులు?

ఇక తొలి ఇన్నింగ్స్ లో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన గిల్.. ఆ తరువాత మళ్లీ బ్యాటింగ్ కి రాలేదు. దీంతో అతడిని రిటైర్డ్ అవుట్ గా ప్రకటించారు. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేయగా.. భారత్ 189 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఈ క్రమంలో 30 పరుగుల స్వల్ప ఆదిక్యం సంపాదించింది. ఇక రెండవ రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులు చేసి ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×