E-Paper
Advertisement

IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేక‌ర్‌.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే

IPL 2026 Auction: పర్స్ అమౌంట్ తో KKR కింగ్ మేక‌ర్‌.. ఏ జట్టు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే
Advertisement

IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 కి సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 16న జరగబోతోంది. ఇందులో భాగంగా నెల రోజుల ముందే ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్ ని విడుదల చేశాయి. నవంబర్ 15.. అనగా శనివారం రోజున మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను రివీల్ చేశాయి. ఇక కొన్ని జట్లు భారీగా ప్రక్షాళన చేశాయి. ఈ వివరాలను అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వెల్లడించాయి.

Also Read: Shoaib Malik: నాలుగో పెళ్లి చేసుకుంటున్న పాకిస్తాన్ క్రికెటర్.. ముగ్గురికి విడాకులు?

Advertisement

ముఖ్యంగా కలకత్తా నైట్ రైడర్స్ ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ ని వదులుకుంది. ముఖ్యంగా గత సంవత్సరం రికార్డు ధర పలికిన వెంకటేష్ అయ్యర్ ని సైతం కేకేఆర్ జట్టు విడుదల చేసింది. అత్యధికంగా కేకేఆర్ పదిమంది ఆటగాళ్లను వదిలేసింది. తద్వారా తన పర్స్ ని భారీగా పెంచుకుంది. మినీ వేలానికి అత్యధిక పర్స్ తో వెళ్ళబోతోంది కేకేఆర్. ఇక అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేసింది. దీంతో డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగబోతున్న వేలంలో కేకేఆర్ అత్యధికంగా రూ. 64.3 కోట్ల పర్స్ మనీ తో బరిలోకి దిగనుంది.

10 ఫ్రాంచైజీల రిలీజ్ ఆటగాళ్ల జాబితా:

కలకత్తా నైట్ రైడర్స్ రిలీజ్ లిస్ట్: వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, మోయిన్ అలీ, మయాంక్ మార్కండే, క్వింటన్ డికాక్, లవ్ నీత్ సిసోడియ, రెహమాన్ ఉల్లా గుర్బాజ్, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్ట్జ్, స్పెన్సర్ జాన్సన్. పర్స్ రూ. 64.3 కోట్లు.

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ లిస్ట్: రవీంద్ర జడేజా, రాహుల్ త్రిపాటి, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్, దీపక్ హుడా, షేక్ రషీద్, మతిషా పతీరణ, కమలేష్ నాగర్ కోటి, వాన్ష్ బేడీ, ఆండ్రూ సిద్దార్ద్. పర్స్ రూ. 43.4 కోట్లు.

సన్ రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ లిస్ట్: మహమ్మద్ షమీ, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అధర్వ టైడ్. పర్స్ రూ. 25.5 కోట్లు.

లక్నో సూపర్ జెయింట్స్ రిలీజ్ లిస్ట్: శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆర్యన్ జుయల్, డేవిడ్ మిల్లర్, షమర్ జోసెఫ్, యువరాజ్ చౌదరి, రాజ్ వర్ధన్ హంగార్కేకర్, ఆకాష్ దీప్. పర్స్ రూ. 22.95 కోట్లు.

ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ లిస్ట్: ఫాప్ డూప్లిసిస్, డోనావర్ ఫెర్రేరా, మానవ్ కుమార్, మోహిత్ శర్మ, జాక్ ప్రెజర్ మెక్ గర్క్, దర్శన్ నల్కండే, సెదిఖుల్లా అటల్. పర్స్ రూ. 21.8 కోట్లు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రిలీజ్ లిస్ట్: లుంగి ఎంగిడి, మయాంక్ అగర్వాల్, టీమ్ సిఫెర్ట్, లియాన్ లివింగ్ స్టోన్, మనోజ్ బాడంగే, బ్లెస్సింగ్ ముజార్బానీ, మోహిత్ రతి. పర్స్ రూ. 16.4 కోట్లు.

రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ లిస్ట్: సంజు శాంసన్, నితీష్ రానా, కృనాల్ సింగ్ రాథోడ్, వానిందు హసరంగ, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ, ఫజలఖ్ ఫారుఖీ, ఆకాష్ మద్వాల్. పర్స్ రూ. 16.05 కోట్లు.

గుజరాత్ టైటాన్స్ రిలీజ్ లిస్ట్: షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్, కరీమ్ జనత్, డసన్ షనక, కుల్వంత్ ఖేజ్రోలియా, మహిపాల్ లోమ్రోర్, గెరాల్డ్ కోయిట్టీ. పర్స్ రూ. 12.9 కోట్లు.

Also Read: CSK: మతీషా పతిరనా ఔట్.. సంజు రాకతో భయంకరంగా మారిన CSK బ్యాటింగ్ ఆర్డర్

పంజాబ్ కింగ్స్ రిలీజ్ లిస్ట్: జోష్ ఇంగ్లీస్, గ్లేన్ మాక్స్ వెల్, ప్రవీణ్ దుబే, కుల్దీప్ సేన్, ఆరోన్ హర్డీ. పర్స్ రూ. 11.5 కోట్లు.

ముంబై ఇండియన్స్ రిలీజ్ లిస్ట్: ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, విగ్నేష్ పుత్తూర్, లిజాడ్ విలియమ్స్, రీస్ టాప్లీ, కేఎల్ శ్రీజిత్, కర్ణ్ శర్మ, బెవాన్ జేకబ్స్. పర్స్ రూ. 2.75 కోట్లు.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×