E-Paper
Advertisement

Varanasi: మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా.. జక్కన్న ప్లాన్ ఏంటి?

Varanasi: మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా.. జక్కన్న ప్లాన్ ఏంటి?
Advertisement

Varanasi:ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాజమౌళి (Rajamouli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29. అయితే సినిమా ప్రకటించిన ఏడాది తర్వాత హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా లక్ష మంది అభిమానుల సమక్షంలో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు జక్కన్న. ఇకపోతే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య 2027 సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) ప్రకటించారు.

మహేష్ బాబు పాత్ర పై హింట్ ఇచ్చిన రాజమౌళి..

ఈవెంట్ లో భాగంగా మహేష్ బాబు పాత్ర గురించి చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. మహాభారతం సినిమా నా డ్రీం ప్రాజెక్టు.. అయితే నేను కలలో కూడా రామాయణం సినిమాను తెరకెక్కిస్తానని అనుకోలేదు. కానీ ఈ సినిమా రూపంలో ఆ అదృష్టం నన్ను వరించింది. ఈ సినిమా కథ రామాయణం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఇందులో శ్రీరాముడిగా అదే సమయంలో శివుడిగా కూడా మహేష్ బాబు కనిపిస్తాడు అంటూ ఎస్ఎస్ రాజమౌళి హింట్ ఇచ్చారు.

రాముడిగా.. రుద్రాగా..

Advertisement

ఈ రెండు పాత్రలో మహేష్ బాబును చూసుకోవచ్చని, నవరసాలు ఈ సినిమా ద్వారా మీకు మహేష్ బాబు చూపించబోతున్నారని కూడా ఎగ్జైట్ మెంట్ పెంచేశారు రాజమౌళి. ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడే రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అసలు అనుకోలేదని, మహేష్ కృష్ణుడిగా బాగుంటాడు అని అందరికీ తెలుసు. కానీ రాముడు లాంటి ప్రశాంతమైన పాత్రకు ఆయన సూట్ అవుతాడా? లేదా ?అని అనుకుంటూనే ఫోటోషూట్ చేసాము. అది చాలా అద్భుతంగా వచ్చింది.

ALSO READ:Varanasi: గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్.. రాజమౌళిపై హిందూ సంఘాలు ఆగ్రహం

భయపడి డిలీట్ చేశాను..

Advertisement

ముఖ్యంగా ఆ ఫోటోని నేను నా మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాను. కానీ ఎక్కడ లీక్ అవుతుందో అని భయపడి దానిని కూడా డిలీట్ చేశాను. ఇప్పటికీ 60 రోజులు షూట్ చేశాము.. ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్ లో తీసుకున్నాము అంటూ తెలిపారు. ఇందులో రుద్ర , రాముడిగా మహేష్ బాబు డ్యూయల్ పాత్ర పోషిస్తున్నారని హింట్ ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు రాజమౌళి. ప్రస్తుతం జక్కన్న చేసిన కామెంట్లు సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

రెండు భాగాలుగా వారణాసి..

ఇదిలా ఉండగా.. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందని గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేఎల్ నారాయణ సుమారుగా 1200 కోట్ల బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×