E-Paper
Advertisement

Director Death: చనిపోతూ మరొకరికి ప్రాణం పోసిన స్టార్ డైరెక్టర్.. ఎవరంటే?

Director Death: చనిపోతూ మరొకరికి ప్రాణం పోసిన స్టార్ డైరెక్టర్.. ఎవరంటే?
Advertisement

Director Death: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు? ఎవరు ? ఏ కారణాల చేత స్వర్గస్తులవుతారో చెప్పడం కష్టం.. పుట్టుక ఎలా అయితే మన చేతుల్లో ఉండదో.. మరణం కూడా అలాగే మన చేతుల్లో ఉండదని అందరికీ తెలిసిందే. సమయం వచ్చినప్పుడు.. భూమి మీద నూకలు చెల్లినప్పుడు ఎవరైనా సరే వెళ్ళిపోవాల్సిందే..ఈ క్రమంలోనే ఇప్పుడు మరో స్టార్ సీనియర్ డైరెక్టర్ కూడా కన్నుమూశారు. అయితే ఈయన చనిపోవడం ఒక ఎత్తు అయితే… చనిపోతూ కూడా ఇతరులకు ప్రాణం పోసి చనిపోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనంగా నిలుస్తోంది. మరి ఆయన ఎవరు? అసలేం చేశారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

ప్రముఖ తమిళ సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న వి. శేఖర్ (V.Sekhar)అనారోగ్య సమస్యతో చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 72 సంవత్సరాలు.. ప్రభుత్వ ఉద్యోగిగా కెరియర్ మొదలుపెట్టిన శేఖర్.. సినిమాల పైన ఉన్న ఆసక్తితో ఎడిటర్ లెనిన్ వద్ద పనిచేశారు. ఆ తర్వాత కే. భాగ్య రాజ్ కు సహాయ దర్శకుడిగా పలు చిత్రాలకు పని చేసిన ఈయన.. తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా కూడా మారి ఎన్నో హిట్టు చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు. అలాంటి ఈయన మరణించారని తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు.

చనిపోతూ గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్..

Advertisement

ఇదిలా ఉండగా డైరెక్టర్ చనిపోతూ కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు. మరణాంతరం తన అవయవాలను దానం చేసి మరొకరికి ప్రాణం పోశారు వి.శేఖర్. ప్రస్తుతం ఈ విషయం తెలిసి డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వార్థం పెరిగిపోతున్న ఈ కాలంలో కూడా చనిపోతూ మరొకరికి ప్రాణం పోయడం అంటే అంత ఆషామాషీ కాదు అంటూ ఆయన గొప్ప మనసును తెగ పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా మరణాంతరం మరొకరికి ప్రాణం పోసి గొప్ప మనసు చాటుకున్నారు వి శేఖర్.

వి. శేఖర్ సినిమా కెరియర్..

తిరువణ్ణామలై సమీపంలోని నీవనతం అనే గ్రామంలో జన్మించారు.. పియుసి పూర్తిచేసిన ఈయన కొంతకాలం కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో మలేరియా నిర్మూలన కార్యకర్తగా కూడా పనిచేశారు. ప్రధానంగా 1990 – 2000ప్రారంభంలో పలు చిత్రాలలో నటించారు. కుటుంబ నాటక చిత్రాలు టీవీ షోల ద్వారా మంచి ప్రజాదరణ పొందిన ఈయన.. మధ్యతరగతి ప్రేక్షకులు ఇష్టపడే తన చిత్రాలలో ఆయన ఎల్లప్పుడూ వ్యక్తిగత టచ్ ఇస్తూ మంచి పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా కూడా పేరు దక్కించుకోవడం గమనార్హం .

Advertisement

1987 నుండి 2014 వరకు సినిమాలలోని తన కెరీర్ ను కొనసాగించిన ఈయనకు ఇద్దరు పిల్లలు. 2003 వరకు తమిళ్ చిత్రాలకే పనిచేసిన ఈయన 2010లో ఒక కన్నడ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక నటుడిగా పల్లికూడం, ఎంగా రాసి నల్ల రాసి అనే చిత్రంలో నటుడిగా నటించారు.

ALSO READ:Varanasi: మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా.. జక్కన్న ప్లాన్ ఏంటి?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×