Gautam Gambhir- PCB: పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది అన్న సంగతి తెలిసిందే. పురుషులతో పాటు మహిళల పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా హీనంగా ఉంది. ఎలాంటి మ్యాచ్ లైనా సరే ఇవ్వకుండానే ఓడిపోతూ వస్తోంది. ఐసీసీ ( ICC Tournaments) టోర్నమెంట్లు ఆసియా కప్ టోర్నమెంట్లలో ( Asia Cup ) కూడా టీమిండియా చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోతూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే టీమిండియా హెడ్ కోర్టు గౌతమ్ గంభీర్ తో (Gautam Gambhir) చర్చలు కూడా జరుగుతోందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board). పాకిస్తాన్ హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టాలని గౌతమ్ గంభీర్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
టీమిండియా చేతిలో ఈ మధ్య కాలంలో వరుసగా ఓడిపోతున్న పాకిస్తాన్ జట్టును కాపాడేందుకు PCB సరికొత్త ప్లాన్ చేసింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను పాకిస్తాన్ కోచ్ గా నియామకం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తోంది. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియా స్వరూపమే మారిపోయిందని గ్రహించిన పాకిస్తాన్… అతని సేవలను వినియోగించుకునేందుకు కుట్రలకు తెర లేపింది. ఉన్న ఫలంగా ఇండియాకు గుడ్ బై చెప్పి పాకిస్తాన్ రావాలని ఆఫర్ కూడా ఇచ్చారట. బీసీసీఐ (BCCI) ఇచ్చే డబ్బులు కంటే రెండింతలు ఇచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేసిందట. ఇక ఈ ఆఫర్ ను కొంత మంది ప్రతినిధుల ద్వారా గౌతమ్ గంభీర్ వద్దకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేరవేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ఇచ్చిన ఆఫర్ పై గౌతమ్ గంభీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ దాదాపు రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. మరో ఏడాదిన్నర కాలం పాటు ఈ పోస్టులో కొనసాగుతారు గౌతమ్ గంభీర్. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన వెంటనే ఈ పదవి నుంచి తప్పుకునే అవకాశాలు ఉంటాయి. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటులో టీమిండియా చాంపియన్ అయితే… మళ్లీ గౌతమ్ గంభీర్ కాంట్రాక్టు రెన్యువల్ చేసే ఛాన్సులు ఉంటాయి. అలా కాకపోతే.. కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ తప్పకుంటారు. ఇక అప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి ఆఫర్ వస్తే… వెళ్లడంపైన ఆయన ఆలోచించనున్నారు. వాస్తవం చెప్పాలంటే గౌతమ్ గంభీర్ దేశ భక్తి ఉన్నవాడు. అందులోనూ భారతీయ జనతా పార్టీకి పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి పాకిస్తాన్ లాంటి దేశానికి కాకుండా మిగిలిన ఏ దేశం నుంచి ఆఫర్ వచ్చిన కోచ్ గా వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.