E-Paper
Advertisement

Gill Breaks Records: గిల్ మెరుపులు.. రికార్డ్స్ బద్దలు..

Gill Breaks Records: గిల్ మెరుపులు.. రికార్డ్స్ బద్దలు..
Advertisement

Gill Breaks Records:టీమిండియా యువ సంచలన బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డుల దుమ్ముదులుపుతున్నాడు. ఇప్పటికే వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతిచిన్న వయస్కుడిగా నిలిచిన గిల్… ఇప్పుడు వన్డేల్లో భారత్ తరఫున ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు… మరో వరల్డ్ రికార్డును కూడా సమం చేశాడు. ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా… పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సరసన గిల్ నిలిచాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో… బాబర్ ఆజామ్ 360 రన్స్ చేశాడు. ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్‌ కూడా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో సరిగ్గా 360 రన్స్ చేశాడు. గిల్ మరొక్క పరుగు చేసినా… ఆజామ్ రికార్డు కూడా బద్దలైపోయేది. శుభ్‌మన్‌ జోరు చూస్తుంటే… ఎప్పుడో ఓసారి ఆజామ్ రికార్డును బద్దలు కొట్టేలా ఉన్నాడని అంటున్నారు… అభిమానులు.

ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ ఇటీవలే రికార్డు సృష్టించాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగి వన్డే సిరీస్‌లో కోహ్లీ 283 రన్స్ చేశాడు. కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 113, 4, 166 రన్స్ చేశాడు. ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 208, 40, 112 పరుగులతో మొత్తం 360 రన్స్ సాధించి… కోహ్లీ రికార్డును తుడిచిపెట్టేశాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో గిల్‌ ఏకంగా 400కు పైగా పరుగులు సాధించాడంటే… అతడి ఫామ్‌ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

2019లో న్యూజిలాండ్ మీదే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన గిల్… 2022లో 12 వన్డేలు ఆడి 638 రన్స్ చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు వన్డేలు ఆడి 500కు పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది గిల్‌ వరుసగా 6 వన్డేల్లో 70, 21, 116, 208, 40, 112 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా వెయ్యి రన్స్ చేసిన బ్యాటర్లలో గిల్‌ది రెండో స్థానం.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×