BigTV English

ICC : ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022.. భారత్ నుంచి ఎవరెవరికి చోటు దక్కిందంటే..?

ICC : ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022.. భారత్ నుంచి ఎవరెవరికి చోటు దక్కిందంటే..?

ICC : వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022 జట్లను ఐసీసీ ప్రకటించింది. టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, బౌలర్ మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, డబుల్‌ సెంచరీ హీరోలు ఇషాన్‌ కిషన్‌, గిల్‌కు స్థానం దక్కలేదు. గతేడాది వన్డేల్లో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. అయ్యర్ 17 మ్యాచుల్లో 724 పరుగులు సాధించాడు. గతేడాది వన్డేల్లో మహమ్మద్ సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సిరాజ్‌ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.


ఐసీసీ జట్టుకు పాక్‌ సారథి బాబర్ అజామ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. జింబాబ్వే బ్యాటర్ సికిందర్‌ రజాను ఐసీసీ జట్టులో చోటు దక్కింది. బంగ్లా ఆల్‌రౌండర్‌ మెహిదీ హసన్‌ కు అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ ట్రావిస్‌ హెడ్, వెస్టిండీస్‌ నుంచి షై హోప్‌, న్యూజిలాండ్‌ నుంచి టామ్‌ లేథమ్‌ ను ఎంపిక చేసింది. జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు, నలుగురు బౌలర్లకు చోటు కల్పించింది. ఈ జట్టులో
‌ ఆడమ్‌ జంపా ఒక్కడే స్పిన్నర్. శ్రీలంక, దక్షిణాఫ్రికా,అఫ్గానిస్థాన్‌ నుంచి ఒక్కరికీ కూడా అవకాశం దక్కలేదు.

ఐసీసీ వన్డే టీమ్‌ ఆఫ్‌ ఇయర్‌ 2022: బాబర్ అజామ్‌, ట్రావిస్‌ హెడ్‌, షై హోప్, శ్రేయస్‌ అయ్యర్, టామ్‌ లేథమ్, సికిందర్ రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జారీ జోసెఫ్‌, మహమ్మద్‌ సిరాజ్, ట్రెంట్‌ బౌల్ట్, ఆడమ్‌ జంపా.


ఐసీసీ ప్రకటించిన మహిళల జట్టులో భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. టీ‌మిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, బౌలర్ రేణుకా సింగ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. స్మృతీ మంధాన గత క్యాలెండర్‌ ఇయర్ లో ఒక సెంచరీ, ఆరు అర్ధశతకాలతో రాణించింది. కెప్టెన్ హర్మన్‌ రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలతో మంచి ప్రదర్శన చేసింది. రేణుకా సింగ్‌ కేవలం ఏడు మ్యాచుల్లోనే 18 వికెట్లు తీసి సత్తా చాటింది. దీంతో ఈ ముగ్గురికి ఐసీసీ జట్టులో చోటు దక్కింది.

మహిళల జట్టు: అలీసా హీలీ, బెత్‌ మూనీ, స్మృతీ మంధాన, హర్మన్‌ ప్రీత్‌ కౌర్, రేణుకా సింగ్‌, లారా వోల్వార్డ్ట్,ఆయబొంగ ఖాకా, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, నాట్‌ స్కివెర్, సోఫీ ఎక్లెస్టోన్, అమేలియా కెర్.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×