E-Paper
Advertisement

Glenn Maxwell – PSL: PSLలోకి మాక్స్‌వెల్ ఎంట్రీ..ఎన్ని కోట్లంటే ? ఆ డ‌బ్బుల‌కు డైప‌ర్లు కూడా రావు

Glenn Maxwell – PSL: PSLలోకి మాక్స్‌వెల్ ఎంట్రీ..ఎన్ని కోట్లంటే ? ఆ డ‌బ్బుల‌కు డైప‌ర్లు కూడా రావు
Advertisement

Glenn Maxwell – PSL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( Indian Premier League Tournament )
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ( Glenn Maxwell ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఆడెందుకు నిర్ణయం తీసుకున్నాడట గ్లెన్ మ్యాక్స్ వెల్. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో కూడా డీలింగ్ కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మ్యాక్సీ మామను, పెషావర్ జల్మి ( Peshawar Zalmi ) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో కోట్లకు కోట్లు డబ్బులు తీసుకున్న గ్లెన్ మ్యాక్స్ వెల్, ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ( Pakistan Super League 2026)  మాత్రం 1.47 కోట్ల రూపాయలకు ఆడ బోతున్నాడు. ఈ మేరకు వేలంలో మాక్సి మామ‌ను పెషావర్ జల్మీ కొనుగోలు చేసిందట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫ్రాన్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో కోట్లు వసూలు చేసి ఇప్పుడు పాకిస్తాన్ లో అడుక్కు తింటావా ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో వచ్చే డబ్బులతో డైపర్లు కూడా రావని ఆడుకుంటున్నారు.

Also Read: Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

ఐపీఎల్ లో మ్యాక్సీ మామ‌పై కోట్ల వ‌ర్షం..

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో దాదాపు 13 సంవత్సరాలు పాటు ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ( Glenn Maxwell ) కొనసాగాడు. 2012 నుంచి 2025 వరకు ప్రతి సీజన్ ల‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు మ్యాక్సీ మామ. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల‌కు త‌క్కువ సీజ‌న్లు ఆడాడు. ఈ నేపథ్యంలోనే 101.58 కోట్లు ఈ 13 సంవత్సరాల కాలంలో సంపాదించాడు గ్లెన్ మ్యాక్స్ వెల్.

ఐపీఎల్ 2025 సమయంలో 4.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జంట కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచాడు గ్లెన్ మ్యాక్స్ వెల్. గత సీజన్ ల‌లో 6 మ్యాచ్ లలో మాక్సి మామకు అవకాశం వస్తే కేవలం 48 పరుగులు మాత్రమే సాధించాడు. అయినప్పటికీ ఈ సీజన్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ను ఏదో ఒక జట్టు తీసుకునే ఛాన్స్ ఉండేది. కానీ అనవసరంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులోకి వెళ్లిపోయాడు. అంతకంటే ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు గ్లెన్ మ్యాక్స్ వెల్. ఇప్పుడు పాకిస్తాన్ లో కోటిన్నర రూపాయలు తీసుకొని క్రికెట్ ఆడాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

 

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×