E-Paper
Advertisement

Raashii khanna: కేజీ యాపిల్స్ రూ.45 మాత్రమే.. అయ్యో రాశి, అవసరమా నీకిది?

Raashii khanna: కేజీ యాపిల్స్ రూ.45 మాత్రమే.. అయ్యో రాశి, అవసరమా నీకిది?
Advertisement

Raashii khanna:సినిమా తారలు అద్దాల మేడల్లో ఉంటారు, బయట ప్రపంచంతో వారికి సంబంధం ఉండదు అని నెటిజన్లు తరచూ సరదాగా విమర్శిస్తుంటారు. తాజాగా రాశి ఖన్నా విషయంలో ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. నిత్యం జిమ్ములు, డైటింగ్‌లు చేసే హీరోయిన్లకు పండ్ల ధరల గురించి తెలుసు అని అనుకుంటాం. కానీ, రాశి మాత్రం మార్కెట్ ధరలకు, తన అంచనాకు ఎక్కడా పొంతన లేకుండా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అమ్మడి మాట కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతోంది.

ఆపిల్స్ ధర కూడా తెలియని రాశి ఖన్నా..

ఒక ఇంటర్వ్యూలో భాగంగా సరదాగా సాగిన సంభాషణలో రాశి ఖన్నా యాపిల్స్ ధర గురించి మాట్లాడాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం ఒక కేజీ యాపిల్ ధర ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు అని అడిగితే.. ఆమె ఏమాత్రం తడబడకుండా బహుశా ఒక 45 రూపాయలు ఉండొచ్చు అని చాలా అమాయకంగా సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే, ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన యాపిల్స్ ధర కిలోకు రూ.150 నుండి రూ.200 వరకు పలుకుతోంది. ఆమె చెప్పిన ధర చూస్తుంటే, రాశి ఏ కాలంలో ఉందో లేక పొరపాటున జామపండ్ల ధర చెప్పిందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

రాశిఖన్నాపై నెట్టింట పేలుతున్న మీమ్స్..

Advertisement

రాశి ఖన్నా కామెంట్ చేసిన కొద్దిసేపటికే ఆ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. “రాశి గారూ.. ఆ 45 రూపాయలకు యాపిల్స్ దొరికే మార్కెట్ ఎక్కడుందో చెబితే మేము కూడా వెళ్లి కొనుక్కుంటాం” అంటూ మీమ్స్ పేలుతున్నాయి. సెలబ్రిటీలు రోజువారీ కిరాణా వస్తువుల ధరలకు ఎంత దూరంగా ఉంటారో చెప్పడానికి ఇదొక నిదర్శనమని కొందరు చమత్కరిస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె అమాయకత్వాన్ని వెనకేసుకొస్తున్నారు. బహుశా ఆమె షాపింగ్‌కు స్వయంగా వెళ్లదు కాబట్టి ఆ ధరల మీద అవగాహన లేకపోయి ఉండొచ్చని, ఆమె చేసిన ఆ తప్పు చాలా ఫన్నీగా ఉందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు రాశి నీకిది అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ‘ఆపిల్ ముచ్చట’ రాశిని వార్తల్లో నిలబెట్టింది.

ఈ ఒక్క ఉదాహరణ.. జీవన విధానంపై తారతమ్యం..

నిజానికి సినిమా షూటింగ్‌లు, క్యారవాన్ల మధ్య గడిపే స్టార్లకు సామాన్యుల కష్టాలు, నిత్యావసర ధరల పెరుగుదలపై పెద్దగా అవగాహన ఉండదు. రాశి ఖన్నా చేసిన ఈ కామెంట్ కేవలం ఒక చిన్న పొరపాటు కావొచ్చు, కానీ అది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలకు సెలబ్రిటీల జీవనశైలికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపింది. ఏదేమైనా, ఒక మంచి నటిగా పేరు తెచ్చుకున్న రాశి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా కొంచెం అప్‌డేటెడ్‌గా ఉంటే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

ALSO READ:Hey Bhagawan Teaser: ‘హే భగవాన్’ టీజర్.. ఫుల్ ఫన్ రైడ్, సుహాస్ కొత్త ప్రయత్నం 

రాశిఖన్నా సినిమాలు..

రాశిఖన్నా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూనే మరొకవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో అవకాశం అందుకుంది. ఇంకా ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని టాలీవుడ్ లో మళ్ళీ పాగా వేసే ప్రయత్నం చేస్తుంది రాశిఖన్నా.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×