E-Paper
Advertisement

KCR : కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. రెండోది ఎవరంటే?

KCR : కేసీఆర్ చుట్టూ దెయ్యాలు.. రెండోది ఎవరంటే?
Advertisement

రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ కేసును ఇంకెంతకాలం సాగదీస్తారని ఇప్పటికే విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ త్వరగా విచారణ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే సిట్ విచారణలో దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. మార్చినెలాఖరులోగా విచారణ పూర్తి చేసి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సిట్ పర్యవేక్షణ అధికారి సజ్జనార్ దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను సిట్ విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది.

సంతోష్ రావుపై కవిత హాట్ కామెంట్స్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన్ను నిన్న సుమారు ఏడున్నర గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. అయితే, ముఖ్యంగా కవిత ఆరోపణలపైనే ఆయన్ను ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.గతంలో తన, తన భర్త ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రధానంగా ఆరోపించారు. అందుకు కారణమైన వారి పేర్లను సైతం బయటపెట్టారు.ఈ క్రమంలోనే నిన్న సంతోష్ రావును సిట్ విచారిస్తున్న క్రమంలో కవిత మరోసారి ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాల్లో మొదటిది సంతోష్ రావే అని మరోసారి స్పష్టంచేశారు.

కేసీఆర్ చుట్టూ మరికొన్ని దెయ్యాలు..

Advertisement

సంతోష్ రావును విచారించే క్రమంలో సిట్ అధికారులు కీలక ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులకు నెంబర్లు ఎవరు ఇచ్చారు? కవిత, ఆమె భర్త ఫోన్ మీరే ట్యాప్ చేయించారా? ఆమె అనుచరులు నెంబర్లు అధికారులకు మీరే ఇచ్చారా? అని అడిగినట్టు తెలుస్తుండగా.. సంతోష్ రావు ఏం సమాధానం ఇచ్చారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, కవిత చేసిన కామెంట్స్ మీద ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ నడుస్తున్నది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె ఆరోపించగా.. మొదటిది సంతోష్ రావు అని చెప్పారు. మరి మిగతా వారెవరు? అని నెట్టింట, రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.

Municipal Elections: కరీంనగర్ కాంగ్రెస్‌లో గందరగోళం..

Advertisement

బీఆర్ఎస్ పార్టీలో తన తండ్రికి ఆమె రాసిన లేఖ బయటకు రావడం వల్లే కల్వకుంట్ల కుటుంబంలో మనస్పర్దలు వచ్చాయి. లేఖ ఎవరు రివీల్ చేశారని ఆమె బయటకు చెప్పలేదు. కానీ, సంతోష్ రావు, హరీశ్ రావుల మీదే ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చాక ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ మీద ఆరోపణలు చేసినా మళ్లీ ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. దీనిని బట్టి కేసీఆర్ చుట్టూ ఉన్న ప్రధాన దెయ్యాల్లో సంతోష్ రావు, హరీశ్ రావులే అని పలువురు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గుర్తుచేస్తున్నారు. కవితను బయటకు పంపించి పార్టీని హస్తగతం చేసుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నారా? అన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి. దీనిపై కవిత క్లారిటీ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సిట్ తర్వాతి నోటీసులు కవిత, ఆమె భర్తకు ఇవ్వనుందని టాక్.

Ajit Pawar Aircraft: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి, ఆ విమానం గురించి మరికొన్ని వివరాలు

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×