Greg Chappell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ పై (Vaibhav Suryavanshi) సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, 700కు పైగా పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ సందర్భంగా బౌండరీ గేట్లు చిన్నగా ఉన్న నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అవలీలగా సిక్సర్లు అలాగే బౌండరీలు బాదుతున్నట్లు వెల్లడించారు. లేకపోతే వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆడబోడని బాంబు పేల్చాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) రాణించడం కష్టమేనని తెలిపారు. అతిగా అతనిపై అంచనాలు పెట్టుకోకూడదని కోరారు. దీంతో గ్రెగ్ చాపెల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అదరగొట్టిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని తాజాగా టీమిండియాలోకి తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీ పై టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ (Greg Chappell) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అదరగొట్టాడు…ఇందులో ఎలాంటి డౌట్ లేదని వ్యాఖ్యానించారు. వరల్డ్ క్లాసు బౌలర్లను కూడా ఒక ఆట ఆడుకున్నాడని వివరించారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి వైభవ్ సూర్యవంశీ ఇప్పుడే తీసుకురావడం చాలా తప్పిదమంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దీని వల్ల అతని భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. లేటెస్ట్ గా శ్రీలంక A జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడని గుర్తు చేశారు గ్రెగ్ చాపెల్. ఇక ఇంగ్లాండ్ లేదా ఐర్లాండ్ తో జరిగే టి20 సిరీస్ లలో అతన్ని ఆడిస్తే.. ఒత్తిడి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. దీని వల్ల వైభవ్ భవిష్యత్తు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో బౌండరీ గేట్లు చిన్నగా ఉంటాయని.. దానివల్ల సులభంగా సిక్సర్లు కొడుతున్నాడని వ్యాఖ్యానించారు. అనుకోకుండా తగిలిన బంతి కూడా సిక్సర్ గేట్లో పడుతోందని వెల్లడించారు. దీనివల్ల స్టార్ అయ్యాడు తప్ప… అంతర్జాతీయ క్రికెట్ లో అతడు రాణించడం కష్టమే అంటూ బాంబు పేల్చారు గ్రెగ్ చాపెల్ (Greg Chappell).